https://oktelugu.com/

Chiranjeevi- Krishna And Mahesh Babu: సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేష్ బాబును పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi- Krishna And Mahesh Babu: ‘గాడ్ ఫాదర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక కోసం నిన్న అనంతపురం వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి ఆ ఫంక్షన్ ను జయప్రదం చేశాడు. జోరువానలోనూ ఎదురుచూసిన అభిమానులను అలరించాడు. గాడ్ ఫాదర్ టీజర్ ను ఈ సందర్భంగా రిలీజ్ చేశాడు. అక్టోబర్ 5 దసరా సందర్భంగా ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే చిరంజీవి నిన్న విశాఖలో షూటింగ్ లో ఉన్నారు. అక్కడ తన తదుపరి చిత్రం కోసం పనిచేస్తున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2022 / 03:42 PM IST
    Follow us on

    Chiranjeevi- Krishna And Mahesh Babu: ‘గాడ్ ఫాదర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక కోసం నిన్న అనంతపురం వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి ఆ ఫంక్షన్ ను జయప్రదం చేశాడు. జోరువానలోనూ ఎదురుచూసిన అభిమానులను అలరించాడు. గాడ్ ఫాదర్ టీజర్ ను ఈ సందర్భంగా రిలీజ్ చేశాడు. అక్టోబర్ 5 దసరా సందర్భంగా ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు.

    Chiranjeevi- Krishna And Mahesh Babu

    అయితే చిరంజీవి నిన్న విశాఖలో షూటింగ్ లో ఉన్నారు. అక్కడ తన తదుపరి చిత్రం కోసం పనిచేస్తున్నారు. అటు నుంచి అటే అనంతపురం వెళ్లి ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అందుకే హైదరాబాద్ లో లేరు

    Also Read: Deepika Padukone: హాస్పిటల్ లో దీపికా పడుకోణె… ప్రెగ్నెంట్ అంటూ వార్తలు…!

    ఇక నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఉదయం మరణించారు. తెల్లవారుజామునే కన్నుమూశారు. మధ్యాహ్నానికి అందరూ రావడంతో ఆమె అంత్యక్రియలు కూడా ముగిశాయి. నిన్న అనంతపురం సినిమా ప్రీరిలీజ్ ఏర్పాట్లలో ఉన్న చిరంజీవి కృష్ణ, మహేష్ బాబులను పరామర్శించలేకపోయారు.

    Chiranjeevi- Mahesh Babu

    ఇక నిన్న వేడుక ముగియగానే ఈరోజు హైదరాబాద్ వచ్చేసిన చిరంజీవి వెంటనే మహేష్ బాబు ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సానుభూతి తెలిపారు. కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇందిరను తలుచుకొని బాధపడ్డారు.

    Also Read: Kajal Aggarwal- Pushpa-2: పుష్ప-2లో కాజల్ అగర్వాల్.. ఒక్క సాంగ్ కోసం అంత డబ్బు ఇస్తున్నారా…!

    Tags