
Mobile Phone: మొబైల్ వచ్చి పదేళ్లు కూడ కావడం లేదు. కానీ ఈ కాలంలో దానికి అందరు ఆకర్షితులయ్యారు. పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు దాంతోనే కాలక్షేపం. యువత అయితే దేని గురించి పట్టించుకోవడం లేదు. కుటుంబం కోసం కూడా సమయం కేటాయించడం లేదు. తిన్నామా సెల్ చూశామా అన్నట్లుగా సాగిపోతోంది. అంతా యాంత్రికంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సెల్ వినియోగం ఇంత దారుణంగా పెరగడానికి కారణాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ప్రభావమే వారిపై ఎక్కువగా పడుతోంది. ఫలితంగా వారు సెల్ ను విడిచి ఉండటం లేదు.
ఈ నేపథ్యంలో ఏ విషయం గురించి మాట్లాడుదామన్నా సమయం ఇవ్వడం లేదు. ఇరవై నాలుగు గంటలు ఫోన్ లోనే సంభాషణలు, యూట్యూబ్ చూడటం వంటివి చేస్తున్నారు. చదువు కూడా సరిగా చదవడం లేదు.ఏమైనా యూట్యూబ్ తో బోలెడు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఫోన్ లతోనే సంపాదన చేయొచ్చని చెబుతున్నారు. ఇలా ఫోన్ కు అట్రాక్టయి తమ జీవితాన్ని శిథిలం చేసుకుంటున్నారు.

బ్రెజిల్ కు చెందిన శాస్త్రవేత్తలు మొబైల్ వినియోగం వల్ల జరిగే నష్టాల గురించి పరిశోధనలు చేసి గుర్తించారు.స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల వెన్ను నొప్పి వస్తుందని తేల్చారు. మూడు గంటల కంటే ఎక్కువ సేపు ఫోన్ చూడటం ద్వారా నష్టాలు వస్తాయని వెల్లడించారు. కళ్లకు దగ్గరగా పెట్టుకోవడం వల్ల కంటి సమస్యలు వచ్చే సూచనలున్నాయి. ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం కూడా ప్రమాదకరమే. ఇలా అన్ని విషయాలు పరిశోధనల ద్వారా గుర్తించారు. అందుకే మొబైల్ వాడకం అంత మంచిది కాదని సూచిస్తున్నారు.
తాకితే కాని బొడుసు రాదన్నట్లు స్వయంగా అనుభవంలోకి వస్తేనే జాగ్రత్తలు తీసుకుంటారు. లేదంటే
పట్టించుకోరు. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యమే వారిని ఇలా చేస్తోంది. ఏది ఏమైనా మొబైల్ వినియోగానికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. కానీ ఎంత మంది దీన్ని పాటిస్తారు. ఎంత మంది వింటారు. మనం చెప్పినా ఏం కాదులే అనే సమాధానమే వస్తుంది. ఫోన్ వాడే యువత తస్మాత్ జాగ్రత్త. వ్యాధుల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.