దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. అంచనాలకు అందని స్థాయిలో దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన కరోనా మహమ్మారి బీర్లపై కూడా ప్రభావం చూపడం గమనార్హం. మద్యం ప్రియులు బీర్లు తాగాలంటే వెనుకడుగు వేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా లిక్కర్ ను ఉపయోగిస్తున్న మద్యం ప్రియులు బీర్లపై ఆసక్తి చుపకపోవడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి.

మద్యం ప్రియులు చిల్డ్ బీర్ తాగితే జలుబు చేసి కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రజలను కరోనా భయం బీర్లకు దూరం చేస్తోంది. దీంతో బీర్ల అమ్మకాలు గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. గతేడాది విక్రయాలను, ఈ ఏడాది విక్రయాలను పోల్చి చూస్తే దాదాపు 20 శాతం బీర్ల అమ్మకాలు తగ్గడం గమనార్హం. బీర్ అమ్మకాలు గణనీయంగా తగ్గుతుంటే లిక్కర్ అమ్మకాలు ఊపందుకోవడం గమనార్హం.
బీర్ల అమ్మకాలు తగ్గడానికి కరోనా వైరస్ తో పాటు మరికొన్ని కారణాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే బీర్ల ధరలు భారీగా పెరిగాయి. లాక్ డౌన్ ముందు రేట్లకు, లాక్ డౌన్ తరువాత రేట్లకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటం కూడా బీర్ల అమ్మకాలు తగ్గడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. గతేడాదితో పోలిస్తే బీర్ల ధరలు 20 నుంచి 40 రూపాయలు పెరిగాయి.
బీర్లకు చేసే ఖర్చుతో బ్రాండెడ్ లిక్కర్ అందుబాటులోకి వస్తోంది. అయితే అమ్మకాలు తగ్గినా ప్రభుత్వాలకు ఆదాయం మాత్రం పెరగడం గమనార్హం. బీర్లు తాగే వారి సంఖ్య తగ్గినా గతంతో పోలిస్తే రేటు పెరగడంతో ప్రభుత్వానికి లాభం పెరిగినట్టు తెలుస్తోంది.