Tollywood Directors: నాగ్ అశ్విన్, సందీప్ వంగ, హను రాఘవపూడి లు ఏ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్స్ గా పనిచేశారో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ ఇప్పటివరకు మరొకరు లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అప్పుడేప్పుడో వచ్చిన శివ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న మూస ధోరణి కథలకు స్వస్తి పలికి, ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన రాంగోపాల్ వర్మ తర్వాత అంతటి ఘన కీర్తిని సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

Written By: Gopi, Updated On : July 19, 2024 7:57 am

Tollywood Directors

Follow us on

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. అందులో టాప్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి లాంటి దర్శకులు ప్రథమ స్థానంలో ఉంటారు. ఇక వీళ్ళు ముగ్గురు కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కొంతమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసి ఆ తర్వాత డైరెక్షన్ చేసి సక్సెస్ లు సాధించారు… మరి వాళ్ళు ఎవరెవరి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశారో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Also Read: ఐదుగురు భార్యలతో శోభనం, ఓటీటీలో సెన్సేషనల్ సిరీస్… ఈవారం స్ట్రీమ్ అవుతున్న చిత్రాలు/సిరీస్ల లిస్ట్!

సందీప్ రెడ్డి వంగ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ ఇప్పటివరకు మరొకరు లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అప్పుడేప్పుడో వచ్చిన శివ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న మూస ధోరణి కథలకు స్వస్తి పలికి, ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన రాంగోపాల్ వర్మ తర్వాత అంతటి ఘన కీర్తిని సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఆయన కెరీర్ మొదట్లో నాగార్జున హీరోగా వచ్చిన కేడి సినిమాకి కిరణ్ కుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాకి క్రాంతి మాధవ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి ఆ తర్వాత అర్జున్ రెడ్డి కథ తో సినిమా చేయాలనే ట్రైల్స్ మొదలుపెట్టి ఆ సినిమాను తీసి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిపాడు…

నాగ్ అశ్విన్
రీసెంట్ గా కల్కి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న నాగ్ అశ్విన్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో శేఖర్ కమ్ముల దగ్గర ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. ఇక ఈ సినిమా ద్వారా ఆయన చాలా మెలకువలు నేర్చుకొని ఆ తర్వాత నుంచి ఒక మంచి స్క్రిప్ట్ రాసుకొని నాని తో సినిమా స్టార్ట్ చేశాడు. అలా ఆయన డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అలాగే మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. ఇక ఆ తర్వాత సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా చేసిన ‘మహానటి’ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకొని ఈ రెండు సినిమాలు సక్సెస్ అయిన తర్వాత ప్రభాస్ ని హీరోగా పెట్టి చేసిన కల్కి సినిమా కూడా రీసెంట్ గా రిలీజ్ అయి భారీ సక్సెస్ ని అందుకుంది…

హను రాఘవపూడి
హను రాఘవపూడి దర్శకుడు అవ్వడానికి ముందు ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేశాడు. ఆయన ఎవరంటే వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను చేసే చంద్రశేఖర్ ఏలేటి…ఈయన దగ్గర ఒక్కడున్నాడు, ప్రయాణం లాంటి సినిమాలకు హను రాఘవపూడి దర్శకత్వ విభాగంలో పని చేశాడు…

ఇలా ఇప్పుడున్న ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ ఒకప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసి వాళ్ళదగ్గర మెలకువలు నేర్చుకొని వాళ్ళు కూడా స్టార్ట్ డైరెక్టర్స్ గా మారిపోయారు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు కూడా ప్రభాస్ తో సినిమాలను చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక అందులో నాగ్ అశ్విన్ ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చేసి ప్రభాస్ తోనే ‘కల్కి 2’ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక సందీప్ వంగ కూడా ప్రస్తుతం ప్రభాస్ తో ‘ స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి కూడా యుద్ధ నేపథ్యం లో సేజ్ ఒక కథ ఆధారంగా ప్రభాస్ తో ఒక సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నాడు…

Also Read: ‘బ్యాడ్ న్యూజ్’ మూవీ యూఎస్ఏ రివ్యూ…