https://oktelugu.com/

Tollywood : బంగార్రాజు సినిమాలో ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…నిత్యం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది…

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా బంగార్రాజు. కరోనా సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

Written By:
  • Mahi
  • , Updated On : January 9, 2025 / 06:41 PM IST

    Viral Photo

    Follow us on

    Tollywood :  అక్కినేని హీరోల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అక్కినేని హీరోలు ఒక భారీ హిట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అక్కినేని నాగార్జున ధనుష్ కుబేర సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు నాగార్జున సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్ లు చాలా వేగంగా జరుగుతున్నాయి. మరోపక్క అక్కినేని నాగచైతన్య కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చైతుకు జోడిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తండేల్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా బంగార్రాజు. కరోనా సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. బంగార్రాజు సినిమాలో హీరో నాగార్జునకు జోడిగా రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించిన. అలాగే హీరో నాగచైతన్య కి జోడిగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించడం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నాగార్జున అనుకున్నట్టుగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.బంగార్రాజు సినిమా 2016లో రిలీజ్ అయిన సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాకు సీక్వెల్ గా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నటించిన చాలామందికి మంచి గుర్తింపు వచ్చింది.

    బంగార్రాజు సినిమాలో నటించిన ఒక చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా స్టార్టింగ్ లో నాగచైతన్య ఒక అమ్మాయితో పులిహోర కలపడం మీరు చూసే ఉంటారు. ఇంత అందంగా ఉంటే దిష్టి తగులుతుంది అంటూ చైతు ఆ అమ్మాయిని బుట్టలో పడేస్తాడు. ఆ సన్నివేశం ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది.ప్రస్తుతం ఈ చిన్నది హీరోయిన్ లకు మించిన అందం తో కుర్రకారును నిద్ర లేకుండా చేస్తుంది. తన క్యూట్ నెస్ తో కేక పుట్టించే అందంతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది.

    ఈ చిన్నదాని పేరు యష్ణ.ఈమె పలు యాడ్స్ లలో కూడా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.అలాగే ఈమె యాడ్స్ తో పాటు పలు సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించింది.లేటెస్ట్ గా సోషల్ మీడియా లో యష్ణ షేర్ చేసిన కొన్ని ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని కవ్విస్తుంది ఈ బ్యూటీ.ఇది ఇలా ఉంటె అక్కినేని నాగచైతన్య ఇటీవలే హీరోయిన్ శోభిత ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.