
Chandrababu: వృక్షశాస్త్రం గురించి బాగా చదివిని వారికి శుష్క ఫలాలు అంటే ఏంటో బాగా తెలుస్తుంది. విత్తనాలు లేకున్నా, తినేందకు పనికి రాకున్నా అవి చూసేందుకు బాగానే కన్పిస్తాయి. మరీ ముఖ్యంగా సాధారణమైన పండ్ల కంటే ఎక్కువ పోషకాలు తీసుకుంటాయి. పక్వానికి వచ్చినట్టు కన్పించినా అవి ఎంతకూ కొమ్మ నుంచి విడిపోవు. ఇలాంటి ఉదాహరణ రాజకీయాలకు తీసుకుంటే చంద్రబాబుకు మించిన నాయకుడు ఎవరు ఉంటారు? ఆయనకు మించిన వెన్నుపోటు రాజకీయాలు చేసే వారు ఇంకెవరు ఉంటారు? ఇప్పుడంటే మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం గెలుపొందాడు కాబట్టి కాలర్ ఎగరేస్తూ ఉండొచ్చు. కానీ ఒకప్పటి పరిస్థితి ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు.
రాజకీయాల్లో హామీలకు విలువ ఉండదేమో గానీ శపథకాలకు విలువ ఉంటుంది. అప్పట్లో కరుణానిధి నుంచి తీవ్ర అవమానం ఎదుర్కొన్న జయలలిత, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేదాకా శాసనసభలో అడుగు పెట్టనని శపధం చేశారు. అన్నట్టుగానే కష్టపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యాకే శాసనసభలో అడుగు పెట్టారు. తనను ఇబ్బంది పెట్టిన కరుణానిధిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించారు. రాజకీయాల్లో ఇది ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయింది. ఇక ఏపీ అసెంబ్లీ విషయానికి వస్తే జగన్ కూడా 2017లో ఇదే తరహా చాలెంజ్ చేసి 2019లో ముఖ్యమంత్రి అయ్యారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబుతో మైండ్ గేమ్ మొదలు పెట్టాడు. దీనికి ఆయన మంత్రివర్గం నాయకులు సహకరించారు. ఇంకేముంది చంద్రబాబును ఏడిపించారు. ఆ ఆక్రోశంలో ఈ కౌరవ సభకు నేను రాను. ముఖ్యమంత్రి అయ్యాకే వస్తాను అని చంద్రబాబు శపథం చేశారు. కానీ నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చారు. ఓటు కోసం సీటు కోసం తాను చేసిన శపథాన్ని పక్కన పెట్టారు. తానెప్పుడూ మాట మీద నిలబడని వ్యక్తినని నిరూపించుకున్నారు.
ఇది ఇలా ఉంటే పచ్చమీడియా ఇచ్చే కలరింగ్ మాములుగా లేదు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీఽధర్‌రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి క్రాస్ ఓటింగ్‌తో నెగ్గిన ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని చంద్రబాబు ఖాతాలో వేసింది. అంతే కాదు చంద్రబాబుపై రాజకీయ దురంధరుడిగా ముద్ర వేసింది. ఇదే చక్రాలు అప్పట్లో చంద్రబాబు ఎందకు తిప్పలేదు? తిరుపతి లాంటి స్థానాల్లో ఎందుకు పోటీ చేయలేదో పచ్చ మీడియా చెప్పదు. చెప్పలేదు.