
PKSDT: పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత వేగవంతంగా షూటింగ్ ని పూర్తి చేసుకోబోతున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది #PKSDT అనే చెప్పాలి. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా, జులై 28 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు ఆ చిత్ర మేకర్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని లీక్ ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.’వకీల్ సాబ్’ , ‘భీమ్లా నాయక్’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ మూడవసారి కూడా సూపర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోబోతున్నాడని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. గత నెల 27 వ తారీఖున ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది.

అయితే ఈ సినిమాని ముందుగా ఆగష్టు 11 వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే రోజున మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ సినిమా విడుదల కాబోతుందని ఈమధ్యనే ఒక ప్రకటన చేసారు. దాంతో ఈ సినిమాని జులై 28 వ తారీఖున విడుదల చేస్తునట్టు ప్రకటించారు. జులై 28 వ తారీఖు అంటే మొహరం ప్రర్వదినం. ఆరోజున విడుదల చేస్తే ఓపెనింగ్స్ ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ లో ఉంటుంది.
అయితే ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సినిమాలకు టికెట్ రేట్స్ ఉండవు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా మామూలు జీవో రేట్స్ మీద విడుదల చెయ్యబోతున్నారు. కానీ టికెట్ రేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ చిత్రం మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాదిస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి వాళ్ళ నమ్మకం నిలుస్తుందా లేదా అనేది.