Car Driver Married College Student: కలికాలం అంటే ఏంటో అనుకున్నాం గానీ.. ఈ నడుమ జరిగే కొన్ని ఘటనలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎవ్వరూ ఊహించని, సమాజం ఒప్పుకోని ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఓ అమ్మాయి చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారేమో. ఈ నడుమ ప్రేమ వివాహాలు చాలా కామన్ అయిపోయాయి. కాగా కర్నాటకలో కూడా ఇలాంటి ప్రేమ వివాహమే జరిగింది. కానీ ఇందులో ఉన్నన్ని ట్విస్టులు సినిమాలో కూడా ఉండవేమో.

మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాకు చెందిన జాలగేరి విలేజ్ లో ఓ కుటుంబం నివసిస్తోంది. అయితే ఆ ఇంటి కూతురు అక్షితను కారు డ్రైవర్ సోమలింగ నిత్యం కాలేజీ దగ్గర కారులో దించేవాడు. ఒకవేళ కారు లేకుంటే.. తన బైక్ మీద ఆమెను కాలేజీలో డ్రాప్ చేసి వచ్చేవాడు. ఇలా వీరిద్దరి నడుమ చనువు బాగా పెరిగింది.
Also Read: రవితేజ ఖిలాడీ పది రోజుల కలెక్షన్లు ఇవే.. వీకెండ్ లో పరిస్థితి దారుణం..!
ఇక తన మాయ మాటలతో ఆ అమ్మాయిని వలలో వేసుకున్న ఆ డ్రైవర్.. తన కోసం ఏమైనా చేసే స్థాయికి ఆ స్టూడెంట్ అక్షితను తీసుకు వచ్చాడు. సోమలింగ ప్రేమ మత్తులో నిండా మునిగిన అక్షిత చివరకు అతనితో పారిపోయి పెండ్లి చేసుకుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఇది వరకే సోమలింగకు వివాహం అయి. . ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న అక్షిత కుటుంబీకులు తమ కూతురును మోసం చేశాడంటూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే సోమలింగతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చిన అక్షిత.. అందరికీ దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. సోమలింగకు పెండ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తనుకు ముందే తెలుసని, పరస్పర అంగీకారంతోనే పెండ్లి చేసుకున్నట్టు తెలిపింది. అంతే కాదు.. సోమలింగకు రెండో పెండ్లాంగానే ఉంటానని, పైగా అతని మొదటి భార్య, పిల్లలతో అన్యోన్యంగా కలిసి మెలిసి జీవిస్తానంటూ కొటేషన్లు చెప్పింది. ఆమె మాటలు విన్న కుటుంబీకులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అక్షిత అక్కడితో ఆగకుండా.. తన కుటుంబం నుండి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Also Read: గర్భిణీ మహిళలకు అలర్ట్.. ఆ చేపలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయట!
Recommended Video:
