https://oktelugu.com/

Bandi Sanjay: మ‌రో పాద‌యాత్ర‌కు సంజ‌య్ రెడీ.. ఎప్ప‌టి నుంచి, ఎక్క‌డి నుంచి..?

Bandi Sanjay: దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాలి అనే సామెత‌ను బండి సంజ‌య్ బాగానే ఫాలో అవుతున్నారు. అస‌లు 2109 ఎంపీ ఎన్నిక‌ల దాకా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియ‌న పేరు ఆయ‌న‌ది. కానీ ఎంపీ అయి ఆ త‌ర్వాత బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అయ్యాక ఆయ‌న పేరు మార్మోగిపోతోంది. ఇంకా చెప్పాలంటే ఆయ‌న అలా చేసుకుంటున్నారు. గ‌తంలో ఉన్న ఏ అధ్య‌క్షుడికి రానంత పేరు బండికి వ‌చ్చింది. ఇందుకు ఆయ‌న క‌ష్టం పెద్ద కార‌ణం అనే చెప్పొచ్చు. […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 21, 2022 / 04:24 PM IST
    Follow us on

    Bandi Sanjay: దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాలి అనే సామెత‌ను బండి సంజ‌య్ బాగానే ఫాలో అవుతున్నారు. అస‌లు 2109 ఎంపీ ఎన్నిక‌ల దాకా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియ‌న పేరు ఆయ‌న‌ది. కానీ ఎంపీ అయి ఆ త‌ర్వాత బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అయ్యాక ఆయ‌న పేరు మార్మోగిపోతోంది. ఇంకా చెప్పాలంటే ఆయ‌న అలా చేసుకుంటున్నారు. గ‌తంలో ఉన్న ఏ అధ్య‌క్షుడికి రానంత పేరు బండికి వ‌చ్చింది. ఇందుకు ఆయ‌న క‌ష్టం పెద్ద కార‌ణం అనే చెప్పొచ్చు.

    Bandi Sanjay

    అయితే ప‌ద‌విలో ఉన్న‌ప్పుడే రాష్ట్రంలో బ‌ల‌మైన నేత‌గా ఎద‌గాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందుకోసం పాద‌యాత్ర‌ల వ్యూహాన్ని మ‌రోసారి తెర‌మీద‌కు తెస్తున్నారు. గ‌తంలో పాద‌యాత్ర చేసిన సంజ‌య్‌.. దాన్ని స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేశారు. అప్పుడు జాతీయ నేత‌లు కూడా వ‌చ్చి పాద‌యాత్ర‌లో పాల్గొన‌డంతో.. ఎక్క‌డ లేని క్రేజ్ ఆయ‌న సొంతం అయింది.

    Also Read: గర్భిణీ మహిళలకు అలర్ట్.. ఆ చేపలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయట!

    ఆ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన సంజ‌య్‌.. మ‌రోసారి పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి కూడా త‌న‌కు క‌లిసి వ‌చ్చిన ఆల‌యాల సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. గ‌తంలో చార్మినార్ ద‌గ్గ‌ర ఉన్న భాగ్య‌ల‌క్ష్మీ అమ్మవారి టెంపుల్ నుంచి మొద‌లు పెట్టారు. ఈసారి మాత్రం జోగుళాంబ ఆలయం నుండి మొద‌లు పెట్టి భద్రాచలం శ్రీరాముల ఆల‌యం ద‌గ్గ‌ర ముగించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా దీన్ని మ‌రో రెండు, లేదా మూడు వారాల్లో స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నారంట‌.

    Bandi Sanjay

    బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి శాశ్వ‌తం కాదు కాబ‌ట్టి.. ప‌వ‌ర్ ఉన్న‌ప్పుడే పార్టీలో త‌న‌దైన ముద్ర వేసుకోవాల‌ని, రాష్ట్రంలో త‌న వ‌ర్గాన్ని పెంచుకోవాల‌ని ఆయ‌న అనుకుంటున్నారు. ఒక బ‌ల‌మైన నేత‌గా ప్ర‌జ‌ల్లో ముద్ర వేసుకుంటే.. త‌న‌కు రాబోయే రోజుల్లో అటు పార్టీలోనూ, ఇటు రాజ‌కీయాల్లోనూ తిరుగుండ‌ద‌ని భావిస్తున్నారు. అందుకే పార్టీలో ఇత‌రుల‌కు ఇందులో ప్రాముఖ్య‌త ఇవ్వ‌కుండా.. త‌న పేరు మీద పాద‌యాత్ర హైలెట్ కావాల‌ని చూస్తున్నారు.

    ఎలాగూ ఎన్నిక‌ల స‌మ‌యం కూడా ద‌గ్గ‌ర ప‌డుతుంది కాబ‌ట్టి.. ఆలోగా త‌న ప్ర‌భావాన్ని చూపించాల‌ని అనుకుంటున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు కేసీఆర్ మీద దూకుడుగా మాట్లాడుతూ తిరుగు లేని నేత‌గా ఎదిగేందుకు చూసుకుంటున్నారు. ఎంతైనా బండి సంజ‌య్ స‌మ‌య స్ఫూర్తి ఉన్న నేత‌గానే చెప్పుకోవాలి.

    Also Read: ఆ విషయంలో నాకు శ్రీదేవే స్ఫూర్తి – ఆలియా భట్

    Tags