Jana Sena Party: రాజకీయాలు మారుతున్నాయి. దేశంల అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వాటి ఫలితాలు వెలువడిన తరువాత పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీల వ్యూహాలు కూడా మారుతాయని తెలుస్తోంది. ఈనేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా రాజకీయ వ్యూహాలు మరింత పదునెక్కనున్నట్లు సమాచారం. పొత్తుల విషయంలో కూడా ఓ స్పష్పత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. దీంతో మార్చి 14 తరువాత తన కార్యాచరణ ప్రకటిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడంతో పార్టీల్లో కలవరం పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్న నేపథ్యంలో పొత్తులు ఎవరెవరి మధ్య ఉంటాయో తెలియడం లేదు. ప్రస్తుతానికి పవన్ బీజేపీతో పొత్తు ఉండటంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రాజకీయాలు రంగు మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Also Read: మరో పాదయాత్రకు సంజయ్ రెడీ.. ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి..?
మార్చి 14 జనసేన ఆవిర్భావ సభ ఉండటంతో ఆ తరువాత పొత్తులపై ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయో తెలియడం లేదు. బీజేపీతోనే కలిసి నడుస్తారా? లేక టీడీపీకి సై అంటారా? అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను ఖరారు చేసుకునేందుకు సమాయత్తం అవుతున్నాయి.
మరోవైపు జాతీయ పార్టీలు కూడా దక్షిణాదిపై కన్నేశాయి. బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్రభావం చూపాలని చూస్తున్నా కుదరడం లేదు. కానీ బీజేపీ మాత్రం దక్షిణాదిపై పట్టు సాధించే క్రమంలో దూసుకుపోతోంది. కానీ ఉత్తరాదిలో మాత్రం వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీతో సంబంధాలు ఉండటంతో టీడీపీ కూడా జనసేనతో పొత్తుకు ప్రయత్నిస్తుండటంతో పవన్ కల్యాణ్ నిర్ణయంపై రెండు పార్టీల్లో భయం పట్టుకుంది. ఏపీలో ప్రభావం చూపాలంటే జనసేన పొత్తు కీలకం కానుండటంతో పవన్ కల్యాణ్ ఎటు వైపు మొగ్గు చూపుతారో అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో అధికారం కోసం తపిస్తున్న బీజేపీ, టీడీపీ లకు ఏ మేరకు న్యాయం చేస్తారో అనే సందేహాలు వస్తున్నాయి.
దీంతో మరోవైపు వైసీపీ కూడా బలంగా ఉండటంతో రాష్ట్రంలో చతుర్ముఖ పోరు ఏర్పడే సూచనలున్నట్లు తెలుస్తోంది. వైసీపీ, టీడీపీ, బీజేపీ రంగంలో ఉన్నా పవన్ కల్యాణ్ కూడా పోటీలో ఉన్నా పొత్తుకే ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు. కానీ అది ఎవరితో ఉంటుందో మాత్రం తెలియడం లేదు.
Also Read: గర్భిణీ మహిళలకు అలర్ట్.. ఆ చేపలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయట!