
Black Pepper Benefits: మన దేశంలో పూర్వం రోజుల్లో మిరపకాయలకు బదులు మిరియాలు వాడేవారట. దీంతో వారికి ఎలాంటి వ్యాధులు వచ్చేవి కావట. ప్రస్తుతం మనం మిరపకాయలకు అలవాటు పడ్డాం. కూరల్లో, పచ్చళ్లల్లో మిరప కారం విచ్చలవిడిగా వాడుతున్నాం. దీంతో మనకు రోగాలు రావడానికి కారణమవుతోంది. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మిరపకాయల కారం మనకు నష్టాలే కలిగిస్తుంది. అయినా మనం లెక్కచేయడం లేదు. కారం లేనిదే తినడం లేదు. మనకు ఉప్పుతో పాటు కారం కూడా ఇబ్బందులు పెడుతుంది. అందుకే వాటికి దూరంగా ఉండాలని ప్రకృతి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండెపోటు రాకుండా చేయడంలో కూడా మిరియాలు సాయపడతాయి.
నల్ల మిరియాలు కూరల్లో వేసుకోవడం వల్ల కొవ్వు నియంత్రణలో ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. దీంతో మిరియాలు కూరల్లో వేసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. మన వంట గదిలో ఉండే మిరియాలు ఉపయోగించడం వల్ల పలు రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక బరువును అదుపులో ఉంచుతాయి. కొవ్వు, బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. కాబట్టి నల్ల మిరియాలు వాడకం మనకు ఎంతో మంచి ఫలితాలు ఇస్తున్నాయి.
మిరియాలను వేడి పాలలో కలిపి తాగడం వల్ల చలి నుంచి రక్షణ కలుగుతుంది. తరచుగా జలుబు, తుమ్ములు రాకుండా నిరోధిస్తాయి. మిరియాల సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి తినడం మంచిది కాదు. ఒకటి నుంచి మొదలు పెట్టి పదిహేను వరకు తీసుకునేందుకు ప్రయత్నించాలి. దీని వల్ల మనకు జలుబు లేకుండా పోతుంది. డీ హైడ్రేషన్ సమస్యకు ఇవి చెక్ పెడతాయి. గోరువెచ్చని నీటిలో వీటిని చేర్చుకుని తాగడం వల్ల శరీరానికి నీటి కొరత ఉండదు. చర్మం పొడిబారకుండా చేయడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.

మెదడును చురుకుదనంగా ఉంచడంలో కూడా ఇవి తోడ్పడతాయి. దీంతో వీటిని మనం కారంకు బదులు వేసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం రోజు వారీ ఆహారంలో నల్ల మిరియాలు తీసుకుంటే మన ఆరోగ్యం దెబ్బ తినకుండా సాయపడతాయి. దీని వల్ల మన శరీరం వ్యాధుల బారిన పడకుండా చేయడంలో వీటి పాత్ర ఎంతో ఉంటుంది. ఈ నేపథ్యంలో మిరియాల వాడకం మన శరీరానికి ఎన్నో రకాలుగా చేస్తుందనడంలో సందేహం లేదు.