
Samantha: చాలా గ్యాప్ తర్వాత సమంత మీడియా ముందుకు వచ్చారు. ఆమె శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇది పౌరాణిక చిత్రం కావడంతో సమంత చీరల్లో ప్రెస్ మీట్స్ కి హాజరవుతున్నారు. అయితే సాంప్రదాయ కట్టులో కూడా సమంత గ్లామర్ యాంగిల్ వదల్లేదు. డీప్ నెక్ జాకెట్ ధరించి యద అందాలు ప్రదర్శన చేసింది. అసలు ఒంటిపై ఉందా లేదన్నట్లుగా జాకెట్ సైజ్ తలపిస్తుంది. ఇక ఉల్లి పొర లాంటి చీర పైట సమంత గ్లామర్ ని ఎలివేట్ చేసింది. శాకుంతలం ప్రమోషనల్ ఈవెంట్లో సమంత ధరించి డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది.
సమంత ఆఫ్ స్క్రీన్ డ్రెస్సింగ్ పలుమార్లు వివాదాస్పదమైంది. వివాహం అనంతరం కూడా దారుణమైన బట్టలో పబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు. ఓ మూవీ ఫంక్షన్ కి సమంత ట్రాన్సపరెంట్ ఎల్లో ట్రెండీ వేర్లో హాజరయ్యారు. ఆ డ్రెస్ డిజైన్ బోల్డ్ గా ఉంది. ఆమె ఇన్నర్ వేర్స్ కనిపిస్తున్నట్లున్న ఆ డ్రెస్ అప్పట్లో వివాదాస్పదమైంది. చెప్పాలంటే సమంత కూడా ఇబ్బంది పడ్డారు. సమంత బోల్డ్ యాటిట్యూడ్ కి ఇది నిదర్శనమని చెప్పొచ్చు.

ఇక పలుమార్లు వాయిదా పడిన శాకుంతలం ఎట్టకేలకు థియేటర్స్ లో దిగుతుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ విశ్వామిత్రుడు కూతురు శకుంతల కథ ఆధారంగా రూపొందించారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ చిత్రంలో దేవ్ మోహన్, మోహన్ బాబు కీలక రోల్స్ చేస్తున్నారు.

మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత అల్లు అర్జున్ వారసురాలు నటించడం. అల్లు అర్హ శకుంతల కొడుకు భరతుడు పాత్ర చేస్తుంది. అంటే సమంతకు కొడుకుగా కనిపించనుందన్న మాట. ప్రెస్ మీట్లో అల్లు అర్హ గురించి సమంత ప్రత్యేకంగా మాట్లాడారు. వందల మంది మధ్య బెరుకు లేకుండా అర్హ నటించిందంటూ సమంత కొనియాడారు.
మరోవైపు సమంత సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నారు. సిటాడెల్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం, ముంబై, నైనిటాల్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. సిటాడెల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న ఖుషి చిత్ర షూటింగ్ తిరిగి మొదలైంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది.