
Jagan And Chandrababu- ABN RK: నచ్చిన చంద్రబాబుకు, మెచ్చిన తెలుగుదేశం పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ సీట్లు వచ్చాయి.. ఇలాంటి సమయంలో అయితే ఆర్కే ఎగిరి గంతెయ్యాలి.. కానీ అదేంటో ఒక హెచ్చరిక జారీ చేశాడు.. బాబూ ఈ ఫలితాలతోనే సంబరపడిపోకండి అంటూ చురక అంటించాడు. ఇవాల్టి తన కొత్త పలుకులో ఇంకా చాలానే రాసుకుంటూ వెళ్ళాడు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను వైఎస్ఆర్సిపి చాలా తేలికగా తీసుకుంటున్నదని, కానీ ఆ పార్టీపై ప్రజల్లో నమ్మకం సన్న గిల్లుతోందని ఆర్కే హెచ్చరించాడు.. ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని ఆర్కే తేల్చి చెప్పాడు.
ఇక రాహుల్ విషయంలో తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా ఆర్కే చెప్పాడు. ఆ మధ్య రాహుల్ గాంధీ వేమూరి రాధాకృష్ణను హైదరాబాదులో ఒక హోటల్లో కలిశాడు. దీనికి తెర వెనుక మధ్యవర్తిత్వం రేవంత్ రెడ్డి నడిపాడు. అప్పటినుంచి ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ పార్టీ వార్తలకు విశేషమైన ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే ఇవాల్టి కొత్త పలుకులు మాస్టర్ హెడ్ కింద రాహుల్ గాంధీ పై లోక్ సభ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అంటూ శీర్షికలో చెప్పేశాడు. కానీ అదే నాలుగో పేజీలోకి వెళ్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ జగన్ మీద తనకున్న ఆగ్రహాన్ని వెలిబుచ్చాడు.
ఇదే సమయంలో చంద్రబాబుకు పలు సూచనలు చేశాడు. ఇదే రాధాకృష్ణ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయేందుకు చంద్రబాబు కారణమని పలు విధాలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అప్పట్లో లగడపాటి రాజగోపాల్ ను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లింది, ప్రజల్లో చంద్రబాబుకు ఆదరణ ఉంది ఆయన చెప్పింది కూడా తానే అనే విషయాన్ని మర్చిపోయాడు. ఇప్పుడేమో ఈ విజయంతో పొంగిపోవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఒకరకంగా తెలుగుదేశం పార్టీకి విజయం సాధించిన ఆనందాన్ని కూడా మిగల్చకుండా చేస్తున్నాడు.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ పేపర్ లీకేజీ సంబంధించి తన పత్రికలో విస్తృతమైన వార్తలు ప్రచురిస్తున్న ఆర్కే.. దానికి అంతంత మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. అంటే ఆర్కే దృష్టిలో ప్రశ్న పత్రం లీక్ అయిన ఘటన కంటే.. రాహుల్ గాంధీ మీద వేటుపడటం ప్రాధాన్యమైపోయింది.. జగన్ ఓడిపోవడం ఇష్టమైపోయింది.. ఆర్కే కావాలనే ఇలా చేశాడా.. లేక తన మిత్రుడు కేసీఆర్ ను కాపాడేందుకు ఇలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ ప్రశ్న పత్రం లీక్ ఘటనకు నామమాత్రపు ప్రాధాన్యమించాడా? అపరిచితుడులో విక్రమ్ లాగా.. ఆర్కె కూడా అంతుపట్టడు.. అంతుపడితే అతడు ఆర్కే ఎలా అవుతాడు?!