https://oktelugu.com/

Bigg Boss Telugu5: నాడు కౌశల్.. నేడు యాంకర్ రవి.. ఫ్యామిలీ సెంటిమెంట్ పీక్స్

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ 2వ సీజన్ విజేతగా కౌశల్ నిలవడంలో అతడి ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా పనిచేసింది. కౌశల్ భార్య, ముఖ్యంగా పిల్లలు వచ్చి కలిసిన క్షణాలు తెరపై అద్భుతంగా పండి అతడిని విజేతగా నిలిపాయి. ఇప్పుడు అదే స్ట్రాటజీని బిగ్ బాస్ 5 సీజన్ లో రవికి అప్లై చేశారు నిర్వాహకులు. అది అద్భుతంగా పేలింది. తాజాగా ఈరోజు రాత్రి జరిగే బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.అది అద్భుతంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2021 / 07:11 PM IST
    Follow us on

    Bigg Boss Telugu 5: బిగ్ బాస్ 2వ సీజన్ విజేతగా కౌశల్ నిలవడంలో అతడి ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా పనిచేసింది. కౌశల్ భార్య, ముఖ్యంగా పిల్లలు వచ్చి కలిసిన క్షణాలు తెరపై అద్భుతంగా పండి అతడిని విజేతగా నిలిపాయి. ఇప్పుడు అదే స్ట్రాటజీని బిగ్ బాస్ 5 సీజన్ లో రవికి అప్లై చేశారు నిర్వాహకులు. అది అద్భుతంగా పేలింది.

    Bigg Boss Telugu5

    తాజాగా ఈరోజు రాత్రి జరిగే బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.అది అద్భుతంగా విజువల్ ట్రీట్ ను పంచింది. బిగ్ బాస్ ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిని లోపలికి పంపుతున్న బిగ్ బాస్ రెండో రోజు అయిన నేడు యాంకర్ రవి భార్య, కూతురును పంపాడు.

    Also Read: Lakshhya Movie: నాగ శౌర్య ” లక్ష్య ” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే ?

    ముందుగా భార్య వచ్చి హగ్ చేసుకోవడం.. ఆ తర్వాత కూతురు కోసం రవి ఆరాటపడడం.. ఆమె ‘ఐ లవ్ యూ నాన్న’ అని అనడం.. రవి ఎమోషనల్ అయ్యి ఇంటి చుట్టూ పరిగెత్తడం.. కూతురు రాగానే మోకాళ్లపై నిలుచొని హగ్ చేసుకోవడం ఇలా ఒక ఎమోషనల్ జర్నీని బిగ్ బాస్ ప్రోమోలో చూపించారు.

    ఇక బిగ్ బాస్ ఇంటిని వదిలిపోవాలని చెప్పినప్పుడు రవి కూతురు ఏడ్వడం.. రవి ఓదార్చడం చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రోమో చూస్తే ఈరోజు ఎపిసోడ్ మొత్తం బిగ్ బాస్ కే హైలెట్ అని చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా యాంకర్ రవికి బూస్టప్ ఇస్తుందని.. అతడినే విజేతగా నిలుపుతుందని చెప్పక తప్పదు. మరి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.

    Also Read: RRR Janani Song: అందుకే రాజమౌళిని తోపు అనేది.. ఈ 3 ఆర్ఆర్ఆర్ సీన్స్ వెనుక ఎంత లోతుందో తెలుసా?

    బిగ్ బాస్ ప్రోమో ఇదీ..

    Tags