Actor Karthikeya: పెళ్లి తర్వాత భార్యతో కలిసి కార్తికేయ మొదటిసారిగా ఎక్కడికి వెళ్లాడో తెలుసా …

Actor Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో శివ పాత్రలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు హీరో కార్తికేయ. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో తన క్రేజ్ మరింత పెరుగుతుంది అనుకున్నారు.  అయితే తర్వాత విడుదలైన హిప్పి, గుణ 369, గ్యాంగ్ లీడర్, 90 ఎమ్మెల్ వంటి చిత్రాలు ఆశించినంతగా విజయాన్ని అందుకోలేక పోయాయి. ఇటీవలే కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి  మెగాస్టార్ చిరంజీవి  కూడా వెళ్లడం జరిగింది. అలానే రిసెప్షన్ కూడా […]

Written By: Raghava Rao Gara, Updated On : November 26, 2021 7:54 pm
Follow us on

Actor Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో శివ పాత్రలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు హీరో కార్తికేయ. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో తన క్రేజ్ మరింత పెరుగుతుంది అనుకున్నారు.  అయితే తర్వాత విడుదలైన హిప్పి, గుణ 369, గ్యాంగ్ లీడర్, 90 ఎమ్మెల్ వంటి చిత్రాలు ఆశించినంతగా విజయాన్ని అందుకోలేక పోయాయి. ఇటీవలే కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి  మెగాస్టార్ చిరంజీవి  కూడా వెళ్లడం జరిగింది. అలానే రిసెప్షన్ కూడా భారీ హంగులతో ఏర్పాటు చేసి వార్తల్లో కూడా నిలిచారు హీరో కార్తికేయ.

Actor Karthikeya

వివాహానంతరం ఈ దంపతులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో… శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని… వివాహాం అవ్వడంతో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారీ ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని హీరో కార్తికేయ తెలిపారు. ఇటీవల కార్తికేయ హీరోగా నటించిన రాజ విక్రమార్క చిత్రం విడుదలై ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.

Also Read: RRR Janani Song: అందుకే రాజమౌళిని తోపు అనేది.. ఈ 3 ఆర్ఆర్ఆర్ సీన్స్ వెనుక ఎంత లోతుందో తెలుసా?

ఈ చిత్రాన్ని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీచిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించగా…  తాన్యా రవిచంద్రన్  హీరోయిన్ గా నటించింది. అలానే  ఈ సినిమాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్, తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్ ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read: Lakshhya Movie: నాగ శౌర్య ” లక్ష్య ” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే ?