Suryakantham: అప్పటి నటీమణుల్లో సూర్యకాంతానికి దీటు రాగలిగే తెలుగు సినిమా సహాయ నటి ఎవరైనా ఉన్నారా ? అని సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. అంతిమంగా వచ్చిన సమాధానం మాత్రం అప్పట్లోనే కాదు, ఇప్పట్లో కూడా.. ఎప్పటికీ కూడా సూర్యకాంతం గారికి, ధీటైన కేరక్టర్ యాక్టర్ లేరు, మరొకరు రారు. ఎందుకంటే.. సూర్యకాంతం కేవలం నటి మాత్రమే కాదు, వెండితెర పై జీవించిన నటి కూడా.
అయితే, అప్పట్లో సూర్యకాంతం డేట్లు బిజీగా ఉంటే.. ఆమెకు ప్రత్యామ్నాయంగా నటి చాయాదేవిని తీసుకునే వారు. సందేహం అక్కర్లేదు, చాయాదేవి కూడా మంచి నటినే. అయితే, ఒక్క గయ్యాళి తనానికే ఆమె పరిమితం అయిపోయింది. సూర్యకాంతం గారిలోని హాస్యం , అమాయకత్వం, కోపం, విసురు, జాలి ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ను చాయాదేవి గారు సమర్ధవంతంగా పలికించేవారు కాదు.
కాదు అంటే కంటే కూడా.. సూర్యకాంతంలా పలికించేవారు కాదు అనడం ఉత్తమం. దానికి తోడు చాయాదేవి కెరీర్ కూడా ఆశించిన స్థాయిలో సాగలేదు. అందుకే ఆమెకు సూర్యకాంతం గారికి వచ్చిన పాత్రలు చాయాదేవికి రాలేదు. కారణం ఏదైనా కానీయి.. సూర్యకాంతం ఎప్పటికీ తెలుగు తెర పై నిలిచేపోయే నటి. ఆమె తెలుగువారి పొద్దుతిరుగుడు పువ్వు. అంత నిండుగా ఉంటుంది ఆమె.
Also Read: అయ్యో.. ఆ ప్రముఖ సింగర్ కుటుంబంలో దారుణం !
ఆమె ప్రతి అత్తకి ‘ఆత్మీయు’రాలు. ఆమె ‘అందాల రాముడి’తో అట్లు తినిపించినా.., గుండమ్మ కథలో తిట్లు అందించినా ఆమె ప్రత్యేకత ఎవరికీ లేదు, రాదు.
అసలు తన గయ్యాళితనంతో గొప్ప నటిగా పేరు ప్రఖ్యతాలు తెచ్చుకుంది అంటేనే ఆమె నటన ఎంత సహజంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నటికీ పొద్దు తిరగని తెలుగుతనం మన సూర్యకాంతమ్మ.
మరి నేటి తరంలో అలాంటి సూర్యకాంతమ్మలు ఎందుకు లేరు ? ఎందుకు రారు ? నిజం మాట్లాడుకుంటే.. ఇప్పటి నటీమణుల్లో నటనే లేదు. ఇక జీవించే నటీమణులు ఎక్కడ నుంచి వస్తారు ? అందుకే సూర్యకాంతం ఎప్పటికీ తెలుగు తెరకు తిరుగులేని నటీమణే.
Also Read: RRR: ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే క్లోజ్ లు.. రాజమౌళి ప్రత్యేక ప్రేమ ఇది !