Srihan- Srisatya: బిగ్ బాస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవ్వరూ ఊహించలేరని అందరూ అంటూ ఉంటారు..ఈ సీజన్ లో కూడా అలాంటిదే జరిగింది..హౌస్ లో అందుకే ఎవరితో కూడా ఎక్కువ స్నేహం చెయ్యకూడదు..వాళ్ళని తోటి కంటెస్టెంట్స్ గానే చూడాలి అని విశ్లేషకులు సైతం చెప్పే మాట..ఎందుకంటే నిన్నటి వరుకు మిత్రులుగా ఉన్నవారు జరిగే టాస్కుల వల్ల ఈరోజు శత్రువులుగా మారిపోవచ్చు..ఈ సీజన్ లో కూడా అదే జరుగుతుంది.

ఉదాహరణకి శ్రీహాన్ టైటిల్ గెలిచేందుకు అన్ని విధాలుగా అర్హుడు..ఎంటర్టైన్మెంట్ పంచడం లో కానీ..టాస్కులు ఆడడం లో కానీ అతను నెంబర్ స్థానం కి ఏ మాత్రం తీసిపోడు..కానీ అతను స్నేహితులను ఒకలాగా..మిగిలిన కంటెస్టెంట్స్ ని ఒకలాగా ట్రీట్ చేస్తూ వచ్చాడు..అదే అతని గేమ్ కి పెద్ద మైనస్ అయ్యింది..హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి శ్రీహాన్ శ్రీ సత్య మరియు రేవంత్ లతో క్లోజ్ గా ఉంటూ వచ్చాడు..కానీ గత వారం లో శ్రీ సత్య తో శ్రీహాన్ కి గొడవ జరిగింది.
అప్పటి నుండి శ్రీహాన్ బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు..ఈరోజు అయితే అతను ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండడం చూస్తే అయ్యో పాపం అనిపిస్తాది..చిన్న గొడవకు నన్ను దూరం పెట్టేసింది..నా అంతట నేను క్రిందకి దిగి అన్ని సార్లు క్షమించమని అడిగినా కూడా అంత యాటిట్యూడ్ చూపించింది అంటూ బాధ పడుతాడు..అంతే కాకుండా మొన్న ఆదివారం నాడు నాగార్జున బేసి ఫ్రెండ్స్ ఎవరు..బయటకి వెళ్లిన తర్వాత ఎవరితో ఫ్రెండ్ షిప్ చెయ్యరు? అని అడగగా పాపం శ్రీహాన్ ‘బెస్ట్ ఫ్రెండ్’ అని ఒక్కరు కూడా చెప్పలేదు.

రేవంత్ మరియు శ్రీ సత్య కూడా శ్రీహాన్ పేరు చెప్పలేదు..ఇందుకు శ్రీహాన్ ఈరోజు బాధపడుతాడు..అలా శ్రీహాన్ ఈరోజు చాలా సేపు ఎమోషనల్ అవుతాడు..ఎప్పుడు నవ్వుతు వెటకారం గా ఉండే శ్రీహాన్ ని ఇప్పటి వరుకు హౌస్ లో ఇంత దిగాలుగా కూర్చొని ఉండడం ఎప్పుడూ చూడలేదు..ఇది శ్రీహాన్ కి ఎమోషనల్ గా మైలేజ్ పెంచుతుందా లేదా అనేది చూడాలి.