Top 3 Indian Directors: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి ఎవరికి లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఆ హీరోలను స్టార్లుగా మార్చడంలో దర్శకులు సైతం కీలకపాత్ర వహిస్తున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్స్ గా వెలుగొందుతున్న వాళ్లు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేస్తూ ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలో ప్రస్తుతానికి టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు.
ఇక అతని తర్వాత అత్యధికమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న వారిలో సందీప్ రెడ్డి వంగ నిలవడం విశేషం… వీళ్ళిద్దరి తర్వాత మూడోవ స్థానంలో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. ముఖ్యంగా ఈ ముగ్గురికి ఇండియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళ సినిమాల కోసం చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ చేయాల్సిన రెండు సినిమాలను లాక్కున్న స్టార్ హీరో…
బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అక్కడి దర్శకులను పట్టించుకోకుండా వీళ్ళ సినిమాల కోసమే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో సైతం వీళ్ళ ముగ్గురి గురించి ఎక్కువగా చర్చలైతే జరుగుతున్నాయి… మరి వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాయి. వాళ్ళకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవడంలో ఈ ముగ్గురు దర్శకులు ఎలా సక్సెస్ అయ్యారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు వీళ్ళు తీసిన సినిమాలు ప్రేక్షకులను మాత్రమే అలరించాయి.
ఇక మీదట వీళ్ళు చేయబోతున్న సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అలాగే ఇండియా పరిధి దాటి ప్రపంచ స్థాయికి విస్తరించాలనే ప్రయత్నం చేస్తున్నారు… ఇక రాబోయే రోజుల్లో వీళ్ళ ముగ్గురిలో ఎవరు భారీ సక్సెస్ ని సాధించి టాప్ లోకి వెళ్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి క్రేజ్ ఏ రేంజ్ లో విస్తరిస్తుంది అనేది…