Bigg Boss 6 Telugu: ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటుగా ఆడియన్స్ తో కూడా తెగ ఆడేసుకుంటున్నాడు..ఇంతకు ముందు నడిచిన సీజన్స్ లో కూడా ట్విస్టులు బాగానే ఉండేవి కానీ ఈ సీజన్ లో మాత్రం ప్రతి రోజు ట్విస్టులు ఇస్తూనే ఉన్నాడు బిగ్ బాస్..అవి ఓవర్ డొసేజ్ ఎక్కువైపోయి ప్రేక్షకులకు కోపం తెప్పించేలా చేస్తుంది..కొద్ది వారాల క్రితమే బిగ్ బాస్ సీజన్ టైటిల్ విన్నర్ క్యాష్ ప్రైజ్ ని ఆటలో పెట్టి 50 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ ని కాస్త 38 లక్షలకు కుదించారు.

ఇది కంటెస్టెంట్స్ కి అప్పట్లో పెద్ద షాక్ అనే చెప్పాలి..ఎందుకంటే ఇలాంటి ట్విస్ట్ బిగ్ బాస్ చరిత్ర లో ఎన్నడూ ఇవ్వలేదు..ఇదెక్కడి మోసం అంటూ కంటెస్టెంట్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా వాపోయారు..మళ్ళీ తిరిగి ఇవ్వరేమో అనుకున్నారు..అయితే ఇప్పుడు హౌస్ లో టాస్కులన్నీ పూర్తి అయ్యాయి..టికెట్ 2 ఫినాలే టాస్కు కూడా ముగిసింది..ఇంకా రెండు వారాలు ఉన్నాయి కదా..ఇంకేమి టాస్కులు నిర్వహిస్తారు అని అనుకున్నారు అందరూ.
అలా అందరూ ఆలోచిస్తున్న సమయంలోనే బిగ్ బాస్ ఈ వారం పోయిన ఆ డబ్బులను తిరిగి రప్పించుకునేందుకు కంటెస్టెంట్స్ కి అరుదైన అవకాశం కలిపించాడు..ముందుగా మొదటి టాస్కులో ఈరోజు గేమ్ కోసం రోహిత్ మరియు శ్రీ సత్య పోటీ పడ్డారు..వీళ్లిద్దరు గార్డెన్ ఏరియా కి వెళ్లిపోయిన తర్వాత లోపలున్న కంటెస్టెంట్స్ ని ఒక్కకారిగా పిలిచి ఈ టాస్కులో ఎవరు గెలవబోతున్నారో వాళ్లకి వోట్ వెయ్యండి అంటారు..అప్పుడు అందరూ బాలట్ బాక్స్ లో రోహిత్ గెలుస్తాడని , శ్రీ సత్య ఓడిపోతుందని వేశారు..బిగ్ బాస్ ఎందుకు అలా వేయించాడు అనేది మొదట్లో ఎవరికీ అర్థం కాదు.

కానీ టాస్కు మొదలయ్యే ముందు అసలు విషయం చెప్తాడు బిగ్ బాస్..బాలట్ బాక్స్ లో ఎవరు అయితే గెలుస్తారని వోట్ వేసారో..వాళ్ళు గెలవకపోతే లక్ష రూపాయిలు తిరిగి రాదు అంటాడు బిగ్ బాస్..కానీ రోహిత్ ఓడిపొయ్యి శ్రీ సత్య గెలవడం తో క్యాష్ ప్రైజ్ పెరిగే అవకాశం ని కోల్పోతారు ఇంటి సభ్యులు..ఇలాంటి టాస్కులు ఈ వారం మొత్తం ఉండబోతున్నాయి.