Homeఎంటర్టైన్మెంట్Kaala Bhairava Love Story: కీరవాణి కొడుకు కాలభైరవతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన యంగ్ హీరోయిన్..ఎవరో...

Kaala Bhairava Love Story: కీరవాణి కొడుకు కాలభైరవతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన యంగ్ హీరోయిన్..ఎవరో మీరే చూడండి!

Kaala Bhairava Love Story: టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఇప్పుడు పెళ్లి సందడే కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ , రష్మిక పెళ్లితో మొదలైన ఈ సీజన్ , అల్లు శిరీష్ -నయనికా , బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య రెడ్డి పెళ్లిళ్లతో కొనసాగింది. రీసెంట్ గానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే ఈ జంట వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో ప్రేమ జంట కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి కుమారుడు కాలభైరవ తో బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ చాలా రోజుల నుండి ప్రేమలో ఉంది. వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు. ఇరువురి కుటుంబాలకు కూడా వీళ్ళ ప్రేమ వ్యవహారం గురించి తెలుసు. వీళ్ళ పెళ్ళికి కూడా అనుమతి తెలిపారు.

Also Read: ఐపీఎల్ 16 రోజులేనా.. బీసీసీఐ ఇచ్చిన ట్విస్ట్ వెనుక అసలు కారణం ఇది

త్వరలోనే నిశ్చితార్థం చేసి, పెళ్లి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయటకు రానివ్వడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ, చాలా రహస్యంగా మైంటైన్ చేసున్నారు. వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమాకు కూడా పని చెయ్యలేదు. అయినప్పటికీ వీళ్ళ మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది ఆశ్చర్యకరమైన విషయం గా మారింది. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ అవ్వడానికి ముందు బాల్యం లో బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ‘మనసంతా నువ్వే ‘ చిత్రం లో ‘తూనీగా తూనీగా’ అనే పాటలో ఈమె అభినయం చూసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ముగ్దులు అయిపోయారు. బాలు చిత్రం లో కూడా ఈమె బాలనటిగా నటించింది. ఇక కాలభైరవ విషయానికి వస్తే , తన తండ్రి లాగానే ఈయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ ని అందించడమే కాకుండా, పలు సినిమాల్లో పాటలు కూడా పాడాడు.

Kaala Bhairava Love Story (1)
Kaala Bhairava Love Story (1)

గత ఏడాది ఈయన ఏకంగా 5 సినిమాలకు మ్యూజిక్ ని అందించాడు. అదే విధంగా ‘దేవర ‘ చిత్రం లో ఈయన పాడిన ‘ఆయుధ పూజ ‘ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. #RRR చిత్రం లో ‘కొమురం భీముడో ‘ పాటని కూడా ఈయనే పాడాడు. ఇలా ఒక పక్క పాటలు పాడుతూ, మరో పాక మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూ కెరీర్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు కాలభైరవ. ఇక కావ్య కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే, ఈమె హీరోయిన్ గా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి. మాసూడ , బలగం వంటి సూపర్ హిట్ చిత్రాలు ఈమె కెరీర్ లో ఉన్నప్పటికీ, అవకాశాలు మాత్రం రావడం లేదు. పెళ్లి తర్వాత అయినా ఈమె తలరాత మారుతుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version