Homeఎంటర్టైన్మెంట్Rajendra Prasad Controversial Comments On MGR: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ...

Rajendra Prasad Controversial Comments On MGR: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ హీరో విశాల్ డిమాండ్.. అసలు ఏమైందంటే!

Rajendra Prasad Controversial Comments On MGR: మైక్ దొరికితే చాలు , నోరు జారడం ఈమధ్య కాలం లో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కి అలవాటు గా మారింది. ముఖ్యంగా ఆయన కూతురు చనిపోయినప్పటి నుండి ఇలా నోరు జారీ మాట్లాడడం ఎక్కువ అయ్యింది. మానసిక పరిస్థితి బాగాలేక ఇలా మాట్లాడుతున్నాడా ?, లేక కావాలనే ఇలా మాట్లాడుతున్నాడా అనేది అర్థం కావడం లేదు. 4 దశాబ్దాల నుండి సినీ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న గౌరవం మొత్తం పోగొట్టుకునేదాకా ఆయన నిద్ర పోయేట్టుగా అనిపించడం లేదు. నోరు జారడం , క్షమాపణలు చెప్పడం ఆయనకు సర్వసాధారమైన విషయం గా మారిపోయింది. ఒకసారి చేస్తే పొరపాటు, ప్రతీ సారీ అదే తప్పు చేస్తే గ్రహపాటు. రీసెంట్ గానే కాంతారావు అవార్డు ని అందుకున్నాడు. ఈ వేడుకకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ కాంతారావు గొప్పదనం గురించి మాట్లాడుతూ తమిళనాడు ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ MGR ని అవమానించాడు.

Also Read: ఐపీఎల్ 16 రోజులేనా.. బీసీసీఐ ఇచ్చిన ట్విస్ట్ వెనుక అసలు కారణం ఇది

ఆయన మాట్లాడుతూ ‘కాంతారావు గారు జానపద సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వారు. ఆరోజుల్లో కాంతారావు జానపద సినిమాలు చేస్తే , తమిళనాడు లో MGR వణికిపోయి పోసుకునేవాడు ‘ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై తమిళియన్స్ రాజేంద్ర ప్రసాద్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. అంతే కాకుండా నడిగర్ సంఘం సభ్యులు కూడా తీవ్రంగా రెస్పాన్స్ ఇచ్చారు. ఆ సంఘానికి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ హీరో విశాల్ సోషల్ మీడియా ద్వారా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించాడు. ఆయన మాట్లాడుతూ ‘ సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్ గా జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో తమిళుల ఆరాధ్య దైవం MGR గురించి మాట్లాడిన మాటలను చూసి షాక్ కి గురయ్యాను. డియర్ సార్, మీ మీద అత్యంత గౌరవంతో, బాధతో నిండిన హృదయం తో స్పందిస్తున్నాను’.

‘తమిళ నాడు లో ఒక సూపర్ స్టార్ గా మాత్రమే కాకుండా, ముఖ్యమంత్రిగా MGR గారి ప్రస్థానం ఎంతో ఉన్నతమైనది. ఆయన పై మీరు చేసిన వ్యాఖ్యలను నేను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాను. లెజండరీ నటుడు కాంతారావు గారి గురించి మీరు మాట్లాడడం అనేది మంచి సంకేతం, అలా అని ఆయన్ని పైకి లేపడానికి మరో లెజండరీ నటుడుని తగ్గించాలని అనుకోవడం మాత్రం తప్పు. ఈ సమయం లో మీరు క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ముగింపు పలకాలని మనస్ఫూర్తిగా అభ్యర్దిస్తున్నాను ‘ అంటూ విశాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న రాజేంద్ర ప్రసాద్, ఇలా రోజు రోజుకి దిగజారడం అనేది మనం చేసుకున్న దురదృష్టం అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version