Betting app Case
Betting app Case : బెట్టింగ్ యాప్ ప్రొమోషన్స్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. చిన్నా పెద్ద అని తేడా లేదు, ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిన ప్రతీ ఒక్కరి పై కేసులు నమోదు చేస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు అభిమానులు. టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), ప్రభాస్(Rebel star Prabhas), గోపిచంద్ లతో కలిపి దాదాపుగా 28 మందిపై పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు విష్ణు ప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల(Anchor Shyamala) వంటి వారు పోలీస్ విచారణలో పాల్గొన్నారు. త్వరలోనే మిగిలిన సెలబ్రిటీలు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చి విచారణలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశం మన టాలీవుడ్ సెలబ్రిటీలను దాటి నేషనల్ సెలబ్రిటీల వరకు వెళ్ళింది. హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ సంస్థ విరాట్ కోహ్లీ(Virat Kohli), సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) వంటి లెజెండ్స్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేసు నమోదు చేయాలని చూస్తున్నారు.
Also Read : బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్!
ఈ ముగ్గురు నేషనల్ లెవెల్ లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి కోట్ల రూపాయిలు సంపాదించారని, వీళ్ళని నమ్మి బెట్టింగ్స్ ఆడి కోట్లాది మంది జనాలు మోసపోయారని, ఇలాంటి టాప్ సెలబ్రిటీలను వదిలేసి పోలీసులు కేవలం యూట్యూబ్ సెలబ్రిటీస్ పై కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. చిన్న సెలబ్రిటీస్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారిస్తున్నారు కానీ, పెద్ద సెలబ్రిటీస్ ని మాత్రం పట్టించుకోవడం లేదని హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న సెలబ్రిటీస్ అంటే డబ్బులకు ఆశపడి తెలిసో తెలియకో ప్రమోట్ చేసి ఉంటారు. కానీ కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ అందుకునే టాప్ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేయడం దురదృష్టకరమైన విషయమని సొసైటీ సభ్యులు మీడియా సమావేశం లో పేర్కొన్నారు.
అయితే యూట్యూబ్ సెలబ్రిటీస్ ని పిలిచి విచారించినట్టుగానే, పోలీసులు షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్స్ ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చి విచారించగలరా?, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ నే అరెస్ట్ చేసి ఒక రాత్రంతా చంచల్ గూడ జైలులో ఉంచిన హైదరాబాద్ పోలీసులు, మిగిలిన సెలబ్రిటీస్ విషయం లో కూడా అలాగే వ్యవహరిస్తారా లేదా వివక్ష చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వివక్ష చూపిస్తే ప్రజలు ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రంగాన్ని ఇద్దరినీ విమర్శిస్తారు. మరి పోలీస్ చర్యలు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి చూడాలి. ఇకపోతే నేడు యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. గతంలో బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేశానని, అలా చేయడం తప్పేనని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా పోలీసులకు సహరిస్తామని చెప్పుకొచ్చింది.
Also Read : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని మాకెలా తెలుస్తుంది?- అనన్య నాగేళ్ల!