India And Israel: ఇజ్రాయెల్.. పాలస్తీనాకు, హమాస్‌కు వ్యతిరేంగా రెండేళ్లుగా యుద్ధం చేస్తోంది. యూదుల దేశమైన ఇజ్రాయెల్‌పై మహాస్ తరచూ దాడి చేస్తోంది. 2023లో దాడిచేసి ఇజ్రాయెల్ ప్రజలను కిడ్నాప్ చేసింది. దీంతో ఇజ్రాయెల్.. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్‌కు అండగా నిలిచిన దేశాలపైనా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో ఉంటున్న యూదులపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆస్ట్రేలియా ఇంటలిజెన్స్ వైఫల్యాన్ని బయటపెట్టింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు కోపం తెప్పించింది. అయితే ఇదంతా ఇజ్రాయెల్ తప్పు అన్న ప్రచారం జరుగుతోంది. దీంతో భారత్ రంగంలోకి దిగింది.
ఇజ్రాయెల్‌కు భారత ప్రతినిధులు..
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇజ్రాయెల్ వెళ్లారు. ఇజ్రాయెల్ కూడా భారత్‌తో స్నేహాన్ని ఆశిస్తోంది, ముఖ్యంగా ఆయుధ ఎగుమతులకు మద్దతు. ప్రపంచ రాజకీయాల్లో ఉద్ధృతి మధ్య ఈ సంప్రదింపులు భారత్ ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుందని స్పష్టం చేశాయి.
ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడి
ఆస్ట్రేలియాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి చేసిన తండ్రి–కొడుకు జంట పాకిస్తాన్ మూలాలతో ముడిపడి ఉన్నారు. తండ్రి 1998లో విద్యార్థి వీసాతో పాకిస్తాన్‌కు వెళ్లాడు, కొడుకు పాక్ క్రికెట్ జెర్సీలో ఫోటోలు షేర్ చేశాడు. 2019లో ఐఎస్‌కు మద్దతు ప్రదించినట్లు సమాచారం. ఈ దాడి యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుందని, ఆస్ట్రేలియాలో లక్షలాది యూదులు ఉన్న నేపథ్యంలో భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలి.
పాకిస్తాన్ తప్పుడు ప్రచారం..
దాడి ఆఫ్గాన్ సంబంధాలతో ఉందని పాకిస్తాన్ మీడియా అబద్ధాలు వ్యాప్తి చేస్తోంది. భారత్‌పై నిందలు వేస్తూ ప్రపంచ దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోందని మన విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచ ఉగ్రవాదులు పాకిస్తాన్ మూలాలే కలిగి ఉన్నారని గుర్తు చేశారు. భారత్, అమెరికా రెండూ దీని వల్ల భారీ నష్టాలు చవిచూశాయి. 1993లో అమెరికాలో జరిగిన దాడి ఘటనలో రామ్జీ యూసుఫ్, 2001 ట్విన్ టవర్స్‌లో ఒసామా బిన్ లాడెన్‌ఇద్దరూ పాక్ ఆశ్రయం పొందారు.
నెతన్యాహు హెచ్చరికలు..
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నవంబర్ 17న ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీజ్‌కు లేఖ రాశారు. పాలస్తీనాకు మద్దతు యూదు భద్రతకు ముప్పుగా మారుతుందని, దాడులు జరిగితే చూస్తూ ఊరుకోవదని హెచ్చరించారు. సిరియా దాడుల సమయంలోనూ ఇలాంటి సందేశం ఇచ్చారు. తాజా ఆస్ట్రేలియా ఘటనపై కూడా తీవ్ర స్పందించారు.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తూ ప్రపంచానికి వ్యాప్తి చేస్తోంది. దాడి చేసినవారు ఆస్ట్రేలియాలో పండ్ల వ్యాపారం, మెస్త్రీ పనులు చేస్తూ యూదులపై దాడి ప్రణాళిక రచించారు. భారత్ ఈ దేశానికి ’మీరు మీరు చూసుకోండి’ అని స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి మధ్య ఆస్ట్రేలియా ఘటనను లాభపడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచానికి పాక్ ఉగ్ర మూలాలను బహిర్గతం చేయాలి.