Smriti Mandhana: ఒక బంధం విచ్చిన్నమైతే.. నమ్మిన మనిషి మోసం చేస్తే.. ఆ బాధ మామూలుగా ఉండదు. ముఖ్యంగా మనతోపాటు ఉండి.. మరో మనిషికి దగ్గర అయితే.. దానికి సంబంధించిన సాక్ష్యాలు కళ్ళముందు కనిపిస్తే దానికి మించిన నరకం మరొకటి ఉండదు. ఈ నరకాన్ని టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందాన ప్రత్యక్షంగా అనుభవించింది. అందువల్లే దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంది. మై లైఫ్ మై రూల్ అన్నట్టుగా వ్యవహరించింది.
పలాష్ ముచ్చల్ తో స్మృతికి చాలా సంవత్సరాల అనుబంధం ఉంది. ఇటీవల టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. పలాష్ తో వైవాహిక బంధం లో అడుగుపెట్టాలని స్మృతి నిర్ణయించుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంది . ఇన్నాళ్లపాటు ప్రేమించిన పలాష్ లో మరో కోణం ఉందని ఆమెకు పెళ్లికి ముందే తెలిసింది. ఇది కూడా ఒకరకంగా ఆమెకు మంచి చేసింది. జీవితాంతం నమ్మకద్రోహితో సంసారం సాగించే బదులు.. ఆదిలోనే దానికి చెల్లు చీటీ చెప్పాలని నిర్ణయించుకుంది. దానికి తగ్గట్టుగానే అతడితో దూరం జరిగింది. మొత్తానికి దూరం పెట్టేసింది. అతడితో పెళ్లిని రద్దు చేసుకుంది.
వాస్తవానికి ఈ విషయం ఎవరికీ తెలియదు. చాలామంది స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందని.. పలాష్ కు ఆరోగ్యం బాగోలేదని అనుకున్నారు. కానీ అసలు వాస్తవం వేరే ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టుగా.. పలాష్ నిజ స్వరూపం కొద్ది రోజుల తర్వాత బయటపడింది. ఆ తర్వాత అతడి విష కౌగిలి నుంచి త్వరగానే స్మృతి బయటపడింది. ఇప్పుడు స్వేచ్ఛావిహంగం లాగా విహరిస్తోంది. ఇటీవల మైదానంలో ప్రాక్టీస్ చేసింది. ఒకప్పటి స్మృతి మాదిరిగా కనిపించింది.
బెంగళూరులో ఓ మొబైల్ సంస్థకు సంబంధించిన కార్యక్రమంలో స్మృతి పాల్గొంది. అంతేకాదు ఒకప్పటి మాదిరిగా కనిపించింది.. బాధ ఉందో? బయటికి చిరునవ్వు చిందిస్తోందో? తెలియదు కానీ.. పూర్తిస్థాయిలో ఆత్మవిశ్వాసంతో కనిపించింది.. ప్రతి సందర్భంలోనూ నవ్వులు పూయించింది.. స్మృతి ఫోటోలు బయటకు రావడంతో అటు బెంగళూరు అభిమానులు.. ఇటు టీమ్ ఇండియా అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. పలాష్ ఆఫ్ట్రాల్ నువ్వు పొట్లకాయ పప్పు గాడివి.. మా స్మృతిని చూడరా.. ఎంత ఆత్మ విశ్వాసంతో ఉంది అని అర్థం వచ్చేలా కామెంట్లు పెడుతున్నారు. కాగా, ప్రతి పెళ్లిని రద్దు చేసుకున్నట్టు ప్రకటించడంతో పలాష్ కొద్దిరోజులుగా బయటికి రాలేదు.
ఇటీవల ఏదో పని మీద విమానాశ్రయానికి వెళ్ళాడు. విలేకరులతో అడగడానికి ప్రయత్నిస్తే ముఖం చాటేసుకుంటూ వెళ్ళిపోయాడు.. కానీ ఆదే స్మృతి ధైర్యంగా కనిపించింది. ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించింది. దీన్ని బట్టి ఎవరు తప్పు చేశారు? ఎవరు నిజాయితీతో ఉన్నారు? అర్థం కావడం లేదూ! చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత.. లేడీ విరాట్ కోహ్లీని దూరం చేసుకుని పలాష్ ముచ్చల్ విలపిస్తూ ఉంటే… విషపు ప్రేమను దూరం చేసుకుని నవ్వుతూ ఉంటుంది. అచ్చం దేవతలాగా..