H1b Visa Delays : అమెరికాలో హెచ్1బీ వీసా అపాయింట్స్ మెంట్స్ రద్దు అవుతున్న తీరు.. అక్కడ ప్రవాస భారతీయ విద్యార్థులు పడుతున్న కష్టాలు.. వాటికి పరిష్కారాలపై టీవీ5 చానెల్ లో జర్నలిస్ట్ మూర్తి ఆధ్వర్యంలో ‘డాలర్ డ్రీమ్స్ ఇక పీడకలే’ పేరుతో ఒక చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో అమెరికా నుంచి తానా స్టూడెంట్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డా.ఉమా.ఆర్.కటికి (ఆరమండ్ల) గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ మూర్తి చర్చను ప్రారంభిస్తూ.. ‘మారిన రూల్స్ నిబంధనల పరిస్థితుల్లో మన వారి పరిస్థితులు ఏమిటి ఉమాగారు? అక్టోబర్ వరకూ హెచ్1బీ వీసా అపాయింట్స్ మెంట్స్ రీషెడ్యూల్స్ పెరిగిపోయాయని.. సోషల్ మీడియా వెట్టింగ్ పేరతో తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల పోస్ట్ పోన్ అయ్యిందని అంటున్నారు.. ఏ కారణమైనా దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం అవుతోందని.. ఈలోపు అమెరికా వెళ్లేవాళ్లు అయిన మన భారతీయుల పరిస్థితి ఏంటని మూర్తి గారు డా.ఉమా గారిని అడిగారు.
దీనికి డా.ఉమా గారు సమాధానమిచ్చారు. ‘‘ మీరు చెప్పిన విషయాలు నిజం. హెచ్1బీ వీసా ఉన్న వాళ్లు కూడా ఇండియా వెళ్లిన వారు.. అక్కడ స్టక్ అయిపోయిన వారు.. ఇండియాలోనే ఆగిపోయిన వారికి అమెరికాలో జాబ్ గ్యారెంటీ కూడా లేకుండా పోతోందని.. ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎప్పుడూ ఎదురు కాలేదన్నారు. హెచ్1బీ, ఓపీటీ, సీపీటీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే.. ఎవరూ ప్రస్తుత కాలంలో అమెరికా వదిలి ఇండియాకు వెళ్లకుండా ఉండడమే మంచిది’ అని డా.ఉమా గారు అభిప్రాయపడ్డారు.
డా. ఉమా గారు ఇలాంటి కేసులపై ఉదాహరణలతో సహా వివరించారు. ‘మొన్న రెండు స్టూడెంట్ కేసులు ఇలాంటివే వచ్చాయని.. ఒక స్టూడెంట్ ఫాదర్ చనిపోయారు. ఇండియాక వెళితే తిరిగి రామన్న భయంతో ఆ స్టూడెంట్ సమస్యపై ఇమిగ్రేషన్ లాయర్ల, అటర్నీలను సంప్రదించినప్పడు అవసరమైతేనే వెళ్లండని.. తప్పదు అనుకుంటేనే ఇండియాకు వెళ్లమని సూచించారని.. లేదంటే వెళ్లకుండా ఉండడమే మంచిదని వాళ్లు చెప్పారని’ ఉమా గారు భారతీయ స్టూడెంట్ బాధలను వివరించారు. వెళ్లిన తర్వాత రిటర్న్ వస్తారో తెలియదు.. వాళ్ల వీసాలను క్యాన్సిల్ కూడా కావచ్చు. ఫస్ట్ ఇయర్ అయ్యింది.. అబుదాబిలో ఆగి ఫోన్ చూసి ఆ అమ్మాయి వీసా క్యాన్సిల్ చేశారు.. కాబట్టి హెచ్1బీ వాళ్ల ఎక్స్ టెన్షన్ కావాలంటే ఇక్కడే అమెరికాలో చేసుకోవచ్చని.. వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు వెళ్లవద్దని డా.ఉమా గారు భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు సూచించారు.
సోషల్ మీడియా వెట్టింగ్ లో వారి సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంక్ ఖాతాలు సైతం చెక్ చేస్తున్నారని.. అన్నింట్లోనూ స్క్రూటీని పెంచారని.. ఏ వీసా మీద వచ్చారో ఆ వీసాకే పరిమితం అయితే బాగుంటారని.. బయట పనులు అమెరికాలో చేయవద్దని.. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని డా. ఉమా గారు అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు సూచించారు.
డా. ఉమా గారు మాట్లాడుతూ ‘‘ భారతీయ స్టూడెంట్స్ సీపీటీలో వాళ్లు చదువుకున్న దానికి మాత్రమే జాబ్ చేయాలి..వేరే ఇతర జాబ్స్ చేయడానికి లేదు.. అమెరికా ప్రభుత్వం ఎంప్లాయిస్ ను కూడా చెక్ చేస్తున్నారని.. అందువల్ల వారు అలెర్ట్ అయ్యి సీపీటీలు వేరే జాబ్స్ చేయడం వల్ల మన విద్యార్థులే సమస్యల్లో పడుతున్నారు. ఇప్పుడు అన్ని వైపులా అమెరికా ప్రభుత్వం ఫోకస్ చేస్తూ అష్టదిగ్బంధనం చేస్తున్నారని.. వెరీ స్టిక్ట్ పాలసీలు అమలు చేస్తున్నారని.. వీటిని వేగంగా అమలు చేస్తున్నారు. గతంలో ఐ94 స్టూడెంట్ వీసా మీద వచ్చి 5 ఏళ్లు ఎక్స్ టెండ్ చేసుకునేవారు. అప్పట్లో ఈజీగా ఐ94 ఇచ్చేసేవారు. ఇప్పుడు ఐ94 కేవలం 6 నెలల వరకు మాత్రమే ఇచ్చేస్తున్నారు. దీంతో ఐ 94 వచ్చిందని వచ్చేస్తున్నారని.. దాని సమయం అయిపోయే లోపే మళ్లీ అప్లై చేసుకోవాలని.. అది వచ్చేసిందని చూసుకోకపోతే రిస్క్ లో పడుతారు. వన్ ఇయర్ స్టడీ టైం ఉన్నవారికి ఆరు నెలలే ఇస్తున్నారని.. అది కూడా విద్యార్థులు చూసుకోండి. ట్రంప్ ప్రభుత్వం చాలా కఠినమైన పాలసీలు అమలు చేస్తోంది. అంతకుముంద స్టూడెంట్స్ కు అన్ లిమిటెడ్ టైం ఉండేది. ఇప్పుడు దాన్ని 4 సంవత్సరాలకు తగ్గిద్దామనే ఆలోచన చేస్తున్నారు. ఇదివరకూ గ్రేస్ పీరియడ్ 60 రోజులు ఉండేది. దాన్ని 30 రోజులకు తగ్గించే ప్రపోజల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్ పబ్లిక్ చేయమని చెప్పారు. ఈ ఆరు నెలలు, వన్ ఇయర్ లో వాళ్లు అన్నీ చెక్ చేస్తారని.. అబుదాబిలో ఇలానే అన్నీ చెక్ చేసి వీసా క్యాన్సిల్ చేసి ఇంటికి పంపించారు. వాళ్లు ఇమిగ్రేషన్ లాయర్లతో కేసు వేసినా ఇంకా వన్ ఇయర్ చదువు ఆగిపోయినా.. ఇదంతా మెంటల్ గా ఎంతో ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. ఇందువల్ల స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. స్టూడెంట్స్ ఇచ్చిన వీసా ద్వారానే వచ్చి ఆ నిబంధనల ప్రకారం నడుచుకుంటే మంచిది అని డా.ఉమా గారు సూచించారు.
ఇక అమెరికా వచ్చి సినిమాల పిచ్చిలో విద్యార్థులు పడి ఓవర్ చేయవద్దని.. దాని వల్ల వారి వీసాలు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంటుందని.. ఈ పద్ధతి మానుకోవాలని ఉమా గారు సూచించారు.
హెచ్1బీ వీసా వారికే జాబ్ లు దొరకడం లేదని.. అలాంటిది స్టూడెంట్స్ ఓపీటీ చేసుకొని బయట వారికి జాబ్ లు దొరకడం మరీ కష్టంగా మారిందని డా. ఉమా గారు తెలిపారు. ఈ టఫ్ టైంలో ఇతర జాబ్ లు చేసినా వారిని గుర్తించి భారత్ కు పంపించేస్తున్నారని తెలిపారు.

