Ananya Nagalla
Ananya Nagalla : గత కొంతకాలం నుండి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా దాదాపుగా పాతిక మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేసారు. వీరిలో కొంతమంది విచారణకు కూడా హాజరై పోలీసులకు వివరణ ఇచ్చారు. రానా దగ్గుబాటి(Rana Daggubati), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాష్ రాజ్(Prakash Raj) వంటి ప్రముఖ స్టార్స్ మీద కూడా కేసులు నమోదు అయ్యాయి. వాళ్ళు వివరణ ఇస్తూ వీడియోలు కూడా చేసారు. అయితే కేసు నమోదైన 25 మందిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన హీరోయిన్ అనన్య నాగేళ్ల(Ananya Nagella) కూడా ఉంది. ఈమె పేరు వింటే మీరు వెంటనే గుర్తు పట్టకపోవచ్చు, వకీల్ సాబ్ చిత్రం లో ఉన్నటువంటి ముగ్గురు అమ్మాయిలలో ఈమె ఒకటి. పవన్ కళ్యాణ్ తల్లి దివ్యా అని పిలుస్తాడు చూడండి, ఆమెనే ఈమె.
Also Read : జాకెట్ వేసుకోకుండా మొత్తం విప్పి చూపించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్
ఈమె అందరి లాగా వివరణ ఇవ్వకుండా ప్రభుత్వాన్నే తిరిగి ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రాపర్టీ అయినటువంటి మెట్రో ట్రైన్స్ పై బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ జరుగుతున్నాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పని మాకు ఎలా అర్థం అవుతుంది? అంటూ ఇంస్టాగ్రామ్ లో ఆమె ఒక ఫోటో స్టోరీ లో పెట్టింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనన్య మాట్లాడిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం అన్నప్పుడు, మెట్రో రైల్స్ పై బహిరంగంగా అలా ఎలా ప్రమోట్ చేయిస్తారు. పోలీసులు కేవలం సినిమా వాళ్లనే ప్రశ్నిస్తారా?, వాళ్ళ మీదనే కేసులు నమోదు చేయిస్తారా?, మెట్రో యాజమాన్యం పై కూడా కేసులు వేసి చర్యలు తీసుకుంటారా?, న్యాయం అందరికీ సమానంగా ఉండాలి కదా?, ప్రభుత్వం వీటిపై ఎందుకు ద్రుష్టి సారించలేదు. పబ్లిక్ గా ఈ స్థాయిలో ట్రైన్స్ పై బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటే, అది తప్పని ఎవరు అనుకుంటారు మీరే చెప్పండి? అంటూ సోషల్ మీడియా లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్. మరి ప్రభుత్వం స్పందించి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.
Also Read : సర్జరీ చేయించుకొని కెరీర్ ని నాశనం చేసుకున్న ‘వకీల్ సాబ్’ బ్యూటీ అనన్య నాగేళ్ల