https://oktelugu.com/

Gold Price: తులం బంగారం రూ.113 మాత్రమే.. డబ్బులుంటే కోటీశ్వరులు కావచ్చు.. కానీ..

పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి బంగారం అంటే అమితమైన ఇష్టం. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా బంగారం కొనాల్సిందే వంటి నిండా అలంకరించుకోవాల్సిందే. అలాంటి బంగారం రేట్లు ఒకప్పుడు చాలా చీప్. 1960కి ముందు తులం బంగారం ధర కేవలం 113 రూపాయలే.

Written By:
  • Rocky
  • , Updated On : January 2, 2025 / 09:07 PM IST

    Gold Price

    Follow us on

    Gold Price : మన దేశంలో పెళ్లిళ్లు, వేడుకలు, అక్షయ తృతీయ, వరలక్ష్మీ వ్రతం ప్రతి సందర్బంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గతంతో పోలిస్తే బంగారం ధర గణనీయంగా పెరిగినప్పటికీ, చాలా మంది దానిని కొనడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న అంశం బంగారం రేట్లు. రీసెంట్ గా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో వెండి, బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో అందరి చూపు ఒక్కసారిగా బంగారం ధరలపై పడింది. బడ్జెట్ సెషన్ తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు నాలుగు వేలకు పైగా పతనమైంది. హైదరాబాద్ నగరంలో చూస్తే (జూలై 25) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73 వేలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79వేలకు చేరింది.

    పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి బంగారం అంటే అమితమైన ఇష్టం. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా బంగారం కొనాల్సిందే వంటి నిండా అలంకరించుకోవాల్సిందే. అలాంటి బంగారం రేట్లు ఒకప్పుడు చాలా చీప్. 1960కి ముందు తులం బంగారం ధర కేవలం 113 రూపాయలే. వినడానికి ఇప్పుడు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పైగా అప్పట్లో తులం అంటే 12 గ్రాములు. (ప్రస్తుతం 10 గ్రాములనే తులం బంగారం అంటున్నారు). ఈ 12 గ్రాముల బంగారం రేటు అప్పుడు కేవలం 113 రూపాయలు మాత్రమే ఉందట. ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

    బంగారం ధర చాలా తక్కువగా ఉన్న కాలంలో, ప్రజల ఆదాయం కూడా చాలా పరిమితంగా ఉండేది. బంగారం కొనుగోలుకు సంబంధించిన పాత రశీదు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రశీదు 11.66 గ్రాముల బంగారం ధర రూ. 113 అని పేర్కొంది. ఈ బిల్లు 1959 నాటిది. తులం బంగారం ప్రస్తుత ధర రూ. 70 నుండి 80వేలు అని పోస్ట్‌లో పేర్కొంది. ఈ పాత బిల్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. వినియోగదారులు దీనిని చూసి షాక్ అవుతున్నారు. ఈ బిల్లు ఫోటోను ‘జిందగీ గుల్జార్ హై’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు లక్షల మందికి పైగా లైక్ చేశారు. చాలా మంది తమ కామెంట్లను కూడా చేస్తున్నారు. ఒక యూజర్ ‘సమయం వేగంగా కదులుతోంది’ అంటూ రాసుకొచ్చారు, మరొక యూజర్ ‘ఆ కాలం నాటి ఆదాయాన్ని పరిశీలిస్తే బంగారం చాలా ఖరీదు’ అని రాశారు.

    దీన్ని బట్టి చూస్తే బంగారం ధరలు ప్రతి దశాబ్దంలో అనూహ్యమైన ఫలితాలను ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ రేట్లపై అవగాహన బాగా పెరగడంతో బంగారం పై ఇన్వెస్ట్ చేయడానికి జనం మక్కువ చూపుతున్నారు. బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు, పసిడి ప్రియులు ఎగబడి మరీ బంగారం కొంటున్నారు.