https://oktelugu.com/

Virat Kohli: టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. ఇందులో నిజం ఎంత?

సిడ్నీ టెస్టులో టీమిండియా కు కెప్టెన్ ఎవరు ఉంటారు? రోహిత్ శర్మకు ఆడే అవకాశం ఉంటుందా? అతడు జట్టుకు నాయకత్వం వహిస్తాడా? ఈ ప్రశ్నలు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ను ఆస్ట్రేలియాలో పలువురు మీడియా ప్రతినిధులు వేయగా.. దానికి అతడు నవ్వుతూ సమాధానం చెప్పాడు. శుక్రవారం నాటి మ్యాచ్ లో మీరే చూస్తారు కదా అంటూ రిప్లై ఇచ్చాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 2, 2025 / 09:11 PM IST

    Virat Kohli

    Follow us on

    Virat Kohli: గౌతమ్ గంభీర్ అలా వ్యాఖ్యలు చేశాడో లేదో గాని.. జాతీయ మీడియాలో సరికొత్త కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. టీమిండియాకు సిడ్నీ టెస్టులో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించబోతాడని .. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారని.. జట్టులో ప్రస్తుతం అంతర్గత యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. విరాట్ అయితేనే విజయాల బాట పడుతుందని.. అందువల్లే విరాట్ మళ్లీ పగ్గాలు అందుకున్నాడని జాతీయ మీడియాలో రకరకాల కథనాలు ప్రసారమయ్యాయి. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి అయితే అంతూ పొంతూ లేదు. న్యూజిలాండ్ సిరీస్ లో రోహిత్ అంతగా ఆకట్టుకోలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లోను అతడు అత్యంత దారుణంగా ఆడుతున్నాడు. గత 15 ఇన్నింగ్స్ లలో రోహిత్ కేవలం 164 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కూడా 10.93 కావటం విశేషం. ఇందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఇక ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్లో రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒకే ఒకసారి మాత్రమే టు డిజిట్ స్కోర్ చేయగలిగాడు. దీంతో అతని టెస్ట్ జట్టు నుంచి నిష్క్రమించాలని.. అతడు జట్టుకు భారంగా మారాడని నెటిజన్లు మండిపడటం మొదలుపెట్టారు. ఇంకా కొందరైతే టెస్ట్ జట్టుకే కాదు.. అసలు క్రికెట్ కే రోహిత్ శర్మ శాశ్వత వీడ్కోలు ప్రకటించాలని పేర్కొంటున్నారు.. అయితే సిడ్నీ టెస్టులో కచ్చితంగా గెలవాలని టీమిండియా భావిస్తోంది. టీమిండియా కచ్చితంగా గెలుపు సాధించాలంటే కెప్టెన్ గా రోహిత్ శర్మ పక్కకు తప్పుకోవాలని.. అప్పుడే బాగుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో చివరి టెస్టులో రోహిత్ ఆడతాడా? లేదా? అనేది అనుమానంగానే ఉంది.. మరోవైపు సిడ్నీ టెస్టులో ప్లే -11 లో ఎలాంటి మార్పులు చేశారు? రోహిత్ శర్మ ఉంటాడా? అనే ప్రశ్నలకు మైదానాన్ని చూసిన తరువాతే తాము నిర్ణయం ప్రకటిస్తామని గౌతమ్ వెల్లడించాడు. దీంతో రోహిత్ చివరి టెస్ట్ ఆడకపోవచ్చని జాతీయ మీడియా ఒక నిర్ధారణకు వచ్చింది. మరవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ టెస్ట్ జట్టుకు వీడ్కోలు పలికే అవకాశం ఉందని.. కాకపోతే అతడు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించడం జాతీయ మీడియా కోడై కూస్తోంది.

    ఉద్రిక్త వాతావరణం

    ప్రస్తుతం భారత జట్టులో ఉద్రిక్త వాతావరణం ఉంది. ఇటీవల మెల్ బోర్న్ టెస్టులో ఓడిపోయిన తర్వాత సీనియర్ ఆటగాళ్లపై కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా రోహిత్, విరాట్ కోహ్లీ, రాహుల్, పంత్, రవీంద్ర జడేజా పై ఒంటి కాలు మీద లేచాడు. దీంతో జట్టులో వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అందువల్లే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పిస్తారని.. విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యత అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి విరాట్ కోహ్లీ కూడా చెప్పుకునే స్థాయిలో ఫామ్ లో లేడు. అతడు ఆస్ట్రేలియా సిరీస్లో ఇప్పటివరకు ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. మిగతా మ్యాచ్లలో దారుణంగా తేలిపోయాడు. ఈ క్రమంలో అతడికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ ను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పిస్తే ఆస్థానంలో బుమ్రా ను నియమించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పెర్త్ టెస్టులో టీమిండియా పై అంచనాలు లేని సమయంలో.. ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలిచే విధంగా బుమ్రా చేశాడు. అందువల్లే అతడిని సిడ్ని టెస్ట్ కు కెప్టెన్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే రోహిత్ అంత ఈజీగా కెప్టెన్సీ వదులుకుంటాడా అనేది.. ఒకింత ప్రశ్నార్థకమే.