Kavitha and Her Dog: రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఉండవు. వారికి బంధాలు ఉండవు. అనుబంధాలు అంతకంటే ఉండవు. ఎంతసేపటికి అధికారం మీద మాత్రమే వారికి పిచ్చి ఉంటుంది. అధికారం కోసమే వారు ఏదైనా చేస్తారనే ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంటుంది.. అందుకే రాజకీయ నాయకులను మన సమాజం పారదర్శకమైన వ్యక్తులుగా అంగీకరించదు. పౌర గణం అంతగా వారిని అనుకరించదు. అందుకే చాలామంది తమ వ్యక్తిగత అభిలాషల విషయానికి వచ్చేసరికి.. పోలీసు లేదా డాక్టర్ లేదా లాయర్.. తదితర స్థానాలలో స్థిరపడాలని అనుకుంటారు. అంతే తప్ప రాజకీయంగా ఎదగాలని.. రాజకీయంగా సేవ చేయాలని ఏమాత్రం అనుకోరు.
రాజకీయ నాయకులకు అధికారం మీద పిచ్చి ఉంటుందనే మాట వాస్తవమే. ఇది కాదనలేని సత్యం కూడా. చాలామంది నాయకులు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చామని చెబుతుంటారు కానీ.. అందరి అంతిమ లక్ష్యం కూడా అధికారమే. అధికారం అనేది అంత సులభంగా దఖలు పడదు. ఈ అధికారాన్ని దక్కించుకోవడానికి రాజకీయ నాయకులు కఠినంగా ఉంటారు. కఠినమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. తమకంటూ బంధాలు ఉండవని.. తమకంటూ బంధుత్వాలను దగ్గరికి చేసుకునే తీరిక ఉండదని పైకి చెబుతుంటారు. కానీ రాజకీయ నాయకులకు కూడా బంధాలు ఉంటాయి. బంధుత్వాలు ఉంటాయి. కేవలం మనుషుల మధ్య మాత్రమే కాదు.. జంతువులతో కూడా రాజకీయ నాయకులు ప్రేమను పెంచుకుంటారు. వాటిపై ప్రేమ చూపిస్తుంటారు.. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. అక్కడిదాకా వస్తున్నాం. కాస్త ఈ కథనం చదివితే ఆ ప్రస్తావన ఎందుకో మీకు అర్థమవుతుంది.
Also Read: కవిత సీఎం అవుతుందట.. కేటీఆర్ కు ఎసరు పెట్టినట్టే?
రాజకీయ నాయకులు మనుషులను అంత ఈజీగా నమ్మరు. రాజకీయ నాయకులకు అత్యంత అంతరంగికమైన వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉంటారు. వారు బయటికి పెద్దగా కనిపించరు. అయితే రాజకీయ నాయకులు తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి.. తమ భారాన్ని దూరం చేసుకోవడానికి జంతువులకు దగ్గరవుతుంటారు. వాటిని ప్రేమగా లాలిస్తారు. తాము మనుషులతో చెప్పలేని మాటలను జంతువుల ఎదుట వ్యక్తం చేస్తుంటారు. ఇందుకు భారత రాష్ట్ర సమితి సుప్రీమ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుంట్ల కవిత మినహాయింపు కాదు.. ఆ మధ్య లిక్కర్ స్కామ్ లో ఆమె అరెస్ట్ అయినప్పుడు.. రకరకాల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఇటీవల పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఈ సందర్భంగా పలు మీడియా చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా టీవీ5 ఛానల్ సీఈఓ మూర్తి నిర్వహించిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కవిత పాల్గొన్నారు. రాజకీయాల నుంచి.. అన్ని విషయాల దాకా కవితను మూర్తి అడిగారు. కానీ ఓ సందర్భంలో మాత్రం కవిత భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. దుఃఖాన్ని ఆపుకుంటూ ఆ సంఘటన గురించి చెప్పారు.
కవిత అరెస్టు అయినప్పుడు ఆమె చేతిలో ఒక కుక్క ఉండేది.. అప్పటికి ఆ కుక్క చలాకిగా ఆమె ఇంట్లో తిరుగుతూ ఉండేది. ఎప్పుడైతే కవిత అరెస్టై ఢిల్లీకి వెళ్లారో.. ఆమె ఇల్లు మొత్తం ఒక రకంగా నెగిటివ్ వైబ్రేషన్ మొదలైంది. సహజంగా జంతువుల మీద నెగిటివ్ వైబ్రేషన్ అనేది నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఆ నెగిటివ్ వైబ్రేషన్ వల్ల ఆ కుక్క చూపు కోల్పోయింది. అయితే కొన్ని వస్తువులను, వ్యక్తులను మాత్రమే కుక్క గుర్తు పడుతుంది. అందువల్లే ఆ కుక్క ఇబ్బంది పడకుండా ఉండడానికి కవిత ఇంట్లో సామాగ్రిని అలానే ఉంచారు. కొత్త వ్యక్తులకు అంతగా ప్రవేశం కల్పించడం లేదు. కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ కుక్క ఆమె దగ్గరికి వచ్చింది. అయితే అది అటు ఇటు తిరుగుతున్న క్రమంలో గాయపడింది. గోడను తగలడం.. వస్తువులు దాటి కింద పడడంతో కవిత ఆ కుక్కను అత్యంత జాగ్రత్తగా పరిశీలించింది.
Also Read: బ్యాంక్ స్కాం కేసులో అల్లు అరవింద్ ని విచారించిన ఈడీ..అసలు ఏమైందంటే!
వెటర్నరీ డాక్టర్ ను పిలిపించి ఆ కుక్కను చూపించింది. డాక్టర్ పరిశీలనలో ఆ కుక్కకు చూపు దాదాపు పోయిందని తేలింది. అయితే ఆ కుక్కతో కవితకు మంచి బాండింగ్ ఉంది. ఒక రకంగా తన పిల్లల్లాగానే ఆమె ఆ కుక్కను చూసుకుంటుంది. ఒక్కసారిగా ఆ కుక్క చూపు మందగించిన నేపథ్యంలో కవిత ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. ఈ విషయాన్ని మూర్తితో ప్రస్తావించుకుంటూ భావోద్వేగానికి గురైంది. కన్నీరు పెట్టుకుంది. మూర్తి చేసిన మొత్తం పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కవిత ప్రస్తావించిన ఈ విషయం హైలైట్ గా నిలిచింది.
View this post on Instagram