తెలుగు రియల్టీ షోలలో *బిగ్ బాస్’ నెంబర్ వన్ షోగా కొనసాగుతోంది. కరోనా సమయంలోనూ బుల్లితెర ప్రేక్షకులను ‘బిగ్ బాస్-4’ ఎంతగానో అలరిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్-4 కార్యక్రమం ప్రారంభమై నెలరోజులు గడిచిపోయాయి. ప్రారంభంలో చప్పగా సాగిన బిగ్ బాస్ షో క్రమంగా రసవత్తరంగా మారుతోంది.
Also Read: అనుష్కనే కావాలి.. ఆ దర్శకుడికి ఫ్యాన్స్ రిక్వెస్ట్..!
16మంది కంటెస్టులతో బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. పెద్ద వయస్సు కలిగిన గంగవ్వ ఇందులో పాల్గొనడం షోకే ప్రత్యేకత వచ్చింది. ఆమె హుషారు చూసిన ప్రేక్షకులంతా అవాక్కైపోయారు. ఉన్నది ఉన్నట్లుగా.. సూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగిన గంగవ్వ తన మాటలు.. పంచులతో అందరినీ ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ ను ఫాలో అయ్యే వారంతా ఆమెకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అందరికీ కంటే ఎక్కువగానే ఓటింగులో గంగవ్వ ముందుండటం గమనార్హం.
బిగ్ బాస్ కు ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఆమెకు ఆరోగ్యం సహకరించడం లేదని తెలుస్తోంది. గతంలో ఆమె బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్లిపోతానని కన్నీటి పర్యాంతమైంది. అయితే ఆమెను బయటికి పంపించేందుకు బిగ్ బాస్ సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకు బదులుగా ఆమె వైద్య చికిత్స అందించడంతో ఆమె తిరిగి కోలుకొని హుషారుగా మారింది. దీంతో గంగవ్వ ఇప్పట్లో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోదని అందరూ భావించారు.
అయితే నిన్నటి ఎపిసోడ్లో గంగవ్వ కు మళ్లీ ఇంటిపైకి గాలిమళ్లినట్లు కన్పిస్తోంది. తనకు ఇక్కడ పిడికెడు ముద్ద కూడా లోపలికి వెళ్లడం లేదని బోరుమంది. ఈసారి ఆమెను బాధను అర్థం చేసుకున్న బిగ్ బాస్ ఆమెను హౌస్ నుంచి పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను అనారోగ్య కారణాలతోనే బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించినట్లు తెలుస్తోంది.
Also Read: ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను లైన్లో పెట్టిన త్రివిక్రమ్..!
దీంతో ఆమెను అభిమానించే వారంతా షాక్ కు గురవుతున్నారు. అయితే గంగవ్వ కారణంగా షో మొత్తంగా సానుభూతితో నడుస్తుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె వెళ్లిపోయాక అయినా కంటెస్టుల ప్రవర్తనలో మార్పు వచ్చి గేమ్ మరింత రసవత్తరంగా మారుతుందని అంటున్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్ నుంచి గంగవ్వ బయటికి వెళ్లడం ఆమె ఫ్యాన్స్ కు వెలితీగా మారనుంది. దీనిని ‘బిగ్ బాస్’ నిర్వాహాకులు ఎలా పూడ్చుతారో వేచిచూడాల్సిందే..!