Gangavva
Gangavva : ఈ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షో పర్వాలేదు అనే రేంజ్ లో సక్సెస్ అయినప్పటికీ, కంటెస్టెంట్స్ మాత్రం బాగా పాపులారిటీ ని సంపాదించారు. వాళ్ళను ఆడియన్స్ మర్చిపోలేరు కూడా. మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్స్ ని సరిగా ఉపయోగించుకోలేదు ఈ సీజన్లో అని అనేక మంది ప్రేక్షకుల అభిప్రాయం. నిఖిల్(Nikhil), గౌతమ్(Gautham Krishna), నభీల్(Nabheel Afridi), యష్మీ(Yashmi Gowda), ప్రేరణ(Prerana Kambam), అవినాష్(Mukku Avinash), టేస్టీ తేజ, రోహిణి ఇలా అందరూ తోపు కంటెస్టెంట్స్, కానీ గేమ్స్ సరిగా ఆడించలేదు, అందుకే సీజన్ 7 రేంజ్ లో హిట్ అవ్వలేదని అందరి అభిప్రాయం. అయితే చాలా కాలం తర్వాత కంటెస్టెంట్స్ అందరూ రీ యూనియన్ అవుతూ ‘బిగ్ బాస్ 8 ‘(Bigg Boss 8 Telugu) ఉత్సవం అనే ప్రోగ్రాం లో ఇటీవలే పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ఆదివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. బిగ్ బాస్ 8 షోలో పాల్గొన్న 22 మంది కంటెస్టెంట్స్ ఈ స్పెషల్ ప్రోగ్రాం లో హాజరయ్యారు.
కాసేపటి క్రితమే ఈ స్పెషల్ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు. ఈ ప్రోమో మొత్తం కలర్ ఫుల్ గా సాగిపోయింది. ప్రోమో చూస్తున్నప్పుడే బిగ్ బాస్ లో గడిచిన 104 రోజులు మన కళ్ళ ముందుకొచ్చినట్టు అనిపించింది. ముఖ్యంగా ఈ ప్రోమో లో నిఖిల్, గౌతమ్, యష్మీ, అవినాష్ హైలైట్ గా నిలిచారు. ముందుగా మీకు కంటెస్టెంట్స్ మధ్య ఉన్న చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని, వాటిని ఈరోజుటితో మీ జ్ఞాపకాల నుండి తొలగించండి అని యాంకర్ శ్రీముఖి చెప్పగా, ముందుగా సీత నిఖిల్ మీద చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్తూ, ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోని తగలబెట్టేసింది. అదే విధంగా గౌతమ్ హౌస్ లో ఉన్నన్ని రోజులు నిఖిల్ తో పడిన గొడవలను గుర్తు చేసుకొని, ఇక నుండి మన మధ్య అలాంటివేమీ ఉండకూడదని ఆ సంఘటనలకు సంబంధించిన ఫోటోని తగలబెట్టేస్తాడు.
అదే విధంగా యష్మీ కి క్షమాపణలు చెప్తారు, ఆమెతో కలిసి వీళ్లిద్దరు డ్యాన్స్ చేయడం హైలైట్ గా నిల్చిన అంశం. అదే విధంగా సోనియా, పృథ్వీ, నిఖిల్ మధ్య బాండింగ్ ని తెలిపే సన్నివేశం, మణికంఠ తో అనీల్ రావిపూడి కామెడీ, విశ్వక్ సేన్ కంటెస్టెంట్స్ అందరిని టార్చర్ చేయడం వంటివి ఈ ప్రోమో లో హైలైట్ గా నిల్చింది. ఇక చివర్లో అవినాష్ తో శ్రీముఖి మాట్లాడుతూ ‘నువ్వు మళ్ళీ ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా, అందరినీ నీకు చెల్లిని చేస్తున్నాం’ అని చెప్పి కంటెస్టెంట్స్ అందరి చేత రాఖీలు కట్టిస్తుంది. చివరికి గంగవ్వ కూడా రాఖీ కట్టేందుకు ముందుకు రావడం పొట్ట చెక్కలు అయ్యేలా చేస్తుంది. కేవలం ప్రోమో తోనే ఇంత ఎంటర్టైన్మెంట్ అంటే, ఇక ఎపిసోడ్ మొత్తం ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది ఉంటుందో ఊహించుకోవచ్చు.