Ram Charan : రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీ కి వచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు వెలుగొందుతున్నాడు…ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమాను చేశాడు…ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని ఇప్పటికే చేపడుతున్న సినిమా యూనిట్ తొందర్లోనే ఈ సినిమా కు సంభందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మరి మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక భారీ సక్సెస్ ని సాధించబోతున్నాడు. మెగా అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ ను చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే గంగవ్వ తిట్టిందని చాలామందికి తెలియదు. కానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ను గంగవ్వ ఎందుకు తిట్టింది. గంగవ్వకు రామ్ చరణ్ ఏదైనా ఇబ్బంది కలిగించాడా అనే ధోరణి లో ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ రీసెంట్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లోకి గెస్ట్ గా వచ్చాడు.
ఇక బిగ్ బాస్ 8 లో విజయం సాధించిన నిఖిల్ కి తన చేతుల మీదుగా ట్రోఫీ ని అందించాడు. అయితే బిగ్ బాస్ లో ఎక్స్ హౌస్ మేట్స్ అయినా కొంతమందిని చూస్తూ వాళ్ళందర్నీ పలకరించిన రామ్ చరణ్ గంగవ్వ కూడా ఎక్స్ హౌజ్ మేట్ లో ఉండడంతో నాగార్జున గంగవ్వను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు.
దాంతో రామ్ చరణ్ గంగవ్వ నాకు తెలుసు రీసెంట్ గా నన్ను తిట్టారు కూడా అంటూ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. రామ్ చరణ్ అలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడు అంటే? గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ గా పని చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో గంగవ్వ కూడా ఒక పాత్రను పోషిస్తుంది. పేద మహిళగా ఆమె పోషించిన పాత్ర చాలా ఇబ్బందులను ఎదురుకుంటుందట దాంతో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన రామ్ చరణ్ దగ్గరకు గంగవ్వ వచ్చి మాకు ఏదైనా న్యాయం చేయండి సార్ అంటూ అతన్ని దూషిస్తూ కొన్ని మాటలు అయితే మాట్లాడిందట.
దాని ఉద్దేశించే రామ్ చరణ్ గంగవ్వ నన్ను తిట్టింది అంటూ ఒక కామెంట్ అయితే చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి… ఇక ఏది ఏమైనా కూడా గంగవ్వ లాంటి ఒక పల్లెటూరులో నివసించే పెద్దావిడ రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు…టాలెంట్ ఉంటే ఎవ్వరిని ఎవ్వరు ఆపలేరు అని చెప్పడానికి గంగవ్వ ని ఉదాహరణగా తీసుకోవచ్చు…