Bigg Boss Telugu 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో గంగవ్వ ఒకరు. పల్లెటూరి యాసలో.. ఆరు పదులు దాటిన వయసులో ఏమాత్రం బెదరకుండా బిగ్‌బాస్ సీజన్ 4లోకి వచ్చిన గంగవ్వ.. ఆరోగ్యం సహకరించడం లేదని నాటు సెల్ప్ ఎగ్జిట్ అయింది. అయితే సీజన్ 8లో మళ్లీ అవకాశం వచ్చింది. సీజన్ 4లో చాలా మంది గంగవ్వను మిస్ అయ్యారు. దీంతో నిర్వాహకులు జీపన్ 8లో వైల్డ్ కార్డు ద్వారా మళ్లీ తీసుకు వచ్చారు. మిడ్ సీజన్‌లో గంగవ్వ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాగానే నెట్టుకొచ్చింది. అనూహ్యంగా గంగవ్వను బయటకు పంపించడంపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.
నామినేషన్స్‌లో వీరు..
బిగ్‌బాస్ పదో వారంలో నికిల్, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్, పృథ్వీ, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే నాగార్జునతో పర్సనల్‌గా మాట్లాడిన గంగవ్వ తన వల్ల కావడం లేదని ఉండలేకపోతున్నానని తెలిపింది. దీంతో ఆమె సెల్ఫ్ ఎలిమినేషన్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఓటింగ్ లిస్ట్‌లో ఉన్న హరితేజను కూడా ఎలిమినేట్ చేశారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఎనిమిది మందిలో మెహబూబ్, నయని పావని, గంగవ్వ, హరితేజ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం రాయల్ క్లాన్‌లో రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్ మాత్రమే ఉన్నారు.
నొచ్చుకున్న ఫ్యాన్స్..
గంగవ్వను మళీ అర్ధంతరంగా బయటకు పంపడంపై ఆమె ఫ్యాన్స్ నొచ్చుకున్నారు. సెల్ఫ్ ఎలిమినేషన్ తర్వాత గంగవ్వను కనీసం స్టేజీ మీదకు కూడా తీసుకురాలేదు. దీంతో నాగార్జునపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం, అనారోగ్య కారణాలతో తప్పుకున్న మణికంఠలను స్టేజ్ మీదికి తీసుకొచ్చి మాట్లాడించిన నాగార్జున గంగవ్వకు ఆ అవకాశం ఇవ్వలేదు.
రివేంజ్ నిజమేనా?
ఇదిలా ఉంటే.. గంగవ్వను స్టేజ్ మీదకు పిలవక పోవడానికి కారణాలపై సోషల్ మీడియాలో రకరకాల కారణాలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి నాగార్జు రివేంజ్ ఒకటి. కొందరు యూట్యూబర్లు తమదైన శైలిలో రివేంజ్‌ను విశ్లేషణ చేస్తున్నారు. గంగవ్వ బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటానని చెప్పినా వినకుండా పట్టు పట్టిందట. తాను బయటకు వెళ్లాలంటే తన మనవరాలికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వాలని నాగార్జునను బ్లాక్‌మెయిల్ చేసిందట. ఆయన వాటిని పట్టించుకోకుండా గంగవ్వను పంపించారని పేర్కొంటున్నారు. స్టేజీమీదకు కూడా అందుకే పిలవలేదని విశ్లేషిస్తున్నారు.
మళ్లీ అనారోగ్యమే..
ఇదిలా ఉంటే.. గంగవ్వ మళ్లీ సెల్ఫ్ ఎలిమినేట్ అయిందట. రెండు రోజులుగా జ్వరంతోపాటు అజీర్తి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్వయంగా గంగవ్వనే తెలిపింది. అందుకే తాను బయటకు వెళ్లాలని నాగార్జునను కోరినట్లు పేర్కొంది. తర్వాత నాగార్జున టీంను అలర్ట్ చేశారు. నిర్వాహకులు గంగవ్వతో మాట్లాడారు. ఆమె కోరిక మేరకు సెల్ఫ్ ఎలిమినేషన్‌కు అనుమతి ఇచ్చారు. అయితే గంగవ్వ అనారోగ్యం దృష్ట్యానే ఆమెను స్టేజీపైకి పిలవలేదట. అంతకు ముందే.. గంగవ్వకు కంటెస్టెంట్స్ ఫొటోలు ఇచ్చి.. ఇందులో ఎవరెవరు బాగా ఆడుతున్నారు. తర్వాత ఎగ్జిట్ అయ్యేది ఎవరని అడిగారట. గంగవ్వ తన తర్వాత హరితేజ ఎలిమినేట్ అవుతుందని ఊహించింది. చెప్పనట్లుగానే హరితేజ ఎలిమినేట్ అయింది. ఇక విజేతలు ఎవరని అడగా, నిఖిల్, నబీల్ ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారని గంగవ్వ చెప్పిందట. తర్వాత గంగవ్వను బయటకు పంపించారట.
ఇంకో రెండు వారాలు ఉండాలని ఉన్నా.. అజీర్తి సమస్య తీవ్రం కావడంతోనే తాను బయటకు వచ్చానని గంగవ్వ తెలిపింది. బిగ్ బాస్ టీంతో కానీ.. నాగార్జునతో కానీ ఎలాంటి గొడవలు జరగలేదని.. రాత్రి 12 దాటడంతోనే తన అనారోగ్యం దృష్ట్యా అప్పటికే లేట్ అయ్యిందనే తనను స్టేజీపైకి పిలవలేదని గంగవ్వ తాజాగా వీడియోతో క్లారిటీ ఇచ్చింది. గొడవలు ఏం లేవని.. సామారస్యంగానే బయటకు వచ్చినట్టు పేర్కొంది.