Atrocities in Bihar: దేశంలో అమానవీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని బాలికలను వ్యభిచార కూపంలోకి సొంత వారే నెట్టడం ఆందోళన కలిగిస్తోంది. చాలా సంఘటనల్లో కన్న వారే బాలికలకు యములుగా మారుతున్నారు. అయినవారే కాని వారుగా మారి వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్రంలో పరిస్థితి మనకు తెలిసిందే. అక్కడ న్యాయవ్యవస్థ కూడా అస్తవ్యస్తమే. డబ్బుకే ప్రాధాన్యం ఇస్తారు. దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. కన్న వారిని సైతం వ్యభిచార రొంపిలోకి దింపే దృశ్యాలు మనకు సాధారణంగానే కనిపిస్తాయి. మానవత్వం మచ్చుకైనా కనిపించదు. నీతి ఎక్కడ కూడా వినిపించదు. అంతా అవినీతికే పెద్దపీట. డబ్బు సంపాదనకే ప్రముఖ స్థానం ఇస్తారు. దీంతో ఆడవారి జీవితాలు హారతి కర్పూరంలా కరిగిపోవాల్సిందే.
బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ లో ఓ ఎస్సై తన కూతురుపైనే అత్యాచారం చేశాడు. పైగా ఆమె చేత వ్యభిచారం చేయిస్తున్నాడు. దీనికి తల్లి కూడా వంత పాడుతోంది. డబ్బు కోసమే ఆమె జీవితాన్ని బుగ్గిపాలు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన పాపను వ్యభిచార కూపంలోకి నెట్టి బాగా డబ్బున్న వారి వద్దకు పంపుతూ వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆమె మానసికంగం కుంగిపోతోంది. ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటోంది.
దీనిపై సోషల్ మీడియాలో తన బాధను వెల్లడించింది. కన్న వారు కాదు కర్కశకులని తన ఆవేదన వెలిబుచ్చింది. దీంతో ఆమెకు పలువురు మద్దతుగా నిలిచారు. దీనిపై పోలీసులు కూడా దృష్టి సారించారు. సదరు తల్లిదండ్రులపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ ఎస్సై సెలవులో ఉన్నారు. ఆయన భార్య పరారీలో ఉంది. కన్న వారే కూతురును వ్యభిచారం చేయాలని వేధించడంతో ఏం చేయాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియలేదు.
తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని వాపోయింది. తన చేత చేయకూడని పనులు చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడింది. లోకంలో పిల్లలను బాగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు ఉండగా తన వారు మాత్రం ఇలా చేయడం సిగ్గు చేటని విచారం వ్యక్తం చేసింది. కన్నవారి కబంధహస్తాల్లో నలిగిపోతున్న బాలికలు ఎందరో ఉన్నారు. కానీ అందులో ధైర్యం చేసి ముందుకు వచ్చేవారు కొందరే. దీంతో బాలిక సాహసం చూసి అందరు ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులే ఇలా ప్రవర్తించడం వెనుక ఏం కారణాలున్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. దీంతో నిందితులను పట్టుకుని శిక్షించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Also Read:BJP 4-GHMC Corporators: మోడీ చెప్పినా, బండి సంజయ్ ప్రమాణం చేయించినా ఉపయోగం లేకుండా పోయింది