Gauravelli Project Land Evacuees: దేశానికి అన్నం పెట్టేది రైతు. ఆరుగాలం కష్టపడి తన శ్రమకు ఫలితం దక్కకపోయినా తాను పస్తులుండి కూడా ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టాలనేది రైతు నైజం. నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మగౌరం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతకు ఆత్మగౌరం లేకుండా పోతోంది. వేల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టుల కోసం తాము తమకు బదుకు దెరువు చూపే భూములను ఇచ్చిన రైతులు పరిహారం కోసం ఏళ్లుగా పోరాటం చేయాల్సిన పరిస్థితి. పోరాడినా న్యాయం జరుగుతుందా అంటే అది లేదు. నిరన తెలిపినందుకు, కడుపు మండి రోడ్డు ఎక్కినందుకు చివరకు జైలుకు వెళ్లాల్సి వస్తోంది. చివరకు సంకెళ్లు వేసుకుని ఉగ్రవాదుల్లా కోర్టు మెట్లు ఎక్కాల్సి దుస్థితి నెలకొంది. రైతు, రైతుబాంధవుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రైతుల బతుకులు బాగవుతున్నాయని ప్రచారం చేసుకునే అధికార పార్టీ నేతలు, మంత్రులు, రూ.50 వేల కోట్లు రైతు బంధు ఇచ్చామని యాసంగిలో సంబరాలు చేసుకున్న నేతలు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు వేసిన బేడీలపై నోరు మెదపడం లేదు.
సంకెళ్లు వేసి.. గొలుసులతో కట్టేసి..
గౌరవెల్లి ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులను.. నేరస్థులు, టెర్రరిస్టులను తీసుకువచ్చినట్టు సంకెళ్లతో కోర్టులో హాజరుపరిచారు. పరిహారం కోసం జూన్ 14న హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద చేపట్టిన ఆందోళన ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు గుడాటిపల్లికి చెందిన 17 మంది నిర్వాసిత రైతులపై కేసులు పెట్టారు. వీరిలో నలుగురిని అదేరోజు అరెస్టు చేయగా.. మిగిలిన వారు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియదు. నలుగురిని అదే రోజు రిమాండ్‌చేసిన పోలీసులు, 14 రోజుల తర్వాత గురువారం హుస్నాబాద్ కోర్టుకు తీసుకొచ్చారు. తమ వారిని సంకెళ్లతో చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. 2017 ఏప్రిల్‌లో ఖమ్మంలోనూ మద్దతు ధర కోసం ఆందోళన చేసిన పది మంది రైతులను ఇలాగే సంకెళ్లతో కోర్టుకు తీసుకురావడం అప్పట్లో దుమారం రేపింది. తాజాగా మరోసారి రైతులకు సంకెళ్లు వేయడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: BJP 4-GHMC Corporators: మోడీ చెప్పినా, బండి సంజయ్ ప్రమాణం చేయించినా ఉపయోగం లేకుండా పోయింది
అత్యాచారం చేసినవారికి బిర్యానీలు రాచ మర్యాదలు...
ఇటీవల హైదరాబాద్‌లో ఓమైనర్ బాలికపై అధికార పార్టీకి చెందిన నేతల కొడుకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో సాక్షాధారాలు బయటకు వచ్చే వరకు కూడా పోలీసులు నేతల కొడుకులు లేరని చెప్పుకొచ్చారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిన రెండు రోజులకు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. చివరకు అరెస్ట్ చేసిన తర్వాత కూడా నిందితులకు పోలీసులు రాచమర్యాదలు చేయడం, ఇళ్ల నుంచి, హోటళ్ల నుంచి బిచార్యనీలు తెప్పించి ఇచ్చారు. పరిహారం అడిగిన పాపానికి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు మాత్రం ఇలా సంకెళ్లు వేశారు. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పంజాబ్ రైతులకు పరిహారం.. సొంత రాష్ట్ర రైతులకు సంకెళ్లు..
నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిపాటు పంజాబ్ రైతులు డిల్లీలో ఉద్యమించారు. ఈ పోరాటంలో పంజాబ్‌కు చెందిన రైతులు చనిపోయారు. రైతు ఉద్యమంతో ప్రధాని నరేంద్రమోదీ దిగివచ్చారు. చట్టాలను ఉపసంహరించుకుని దేశ రైతులకు క్షమాపణలు చెప్పారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు తెలంగాణ రైతు బాంధవుడని రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేసే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల పంజాబ్‌కు వెళ్లి మరీ పరిహారం అందించారు. సొంత రాష్ట్రంలో రైతులు అన్నమో రామచంద్రా అని అంగలారుస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. కడుపు మండి పోరాటం చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తున్నాడు సదరు రైతు బాంధవుడు. ఇదేనా బంగారు తెలంగాణ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read:Devendra Fadnavis: ఆటలో అరటిపండుగా మిగిలిన మాజీ సీఎం ఫడ్నావీస్