https://oktelugu.com/

Kerala Husband Kills Wife: బ్రష్ చేయకుండానే ముద్దు.. సీరియస్ అయిన భార్యను ఆ భర్త ఏం చేశాడో తెలుసా?

Kerala Husband Kills Wife: చిన్న చిన్న గొడవలే సంసారాలను గుల్ల చేస్తుంటాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతుంటాయి. చిన్న విభేదాలే ప్రాణాలు పోయే వరకు వేధిస్తుంటాయి. తన మాట వినలేదనే కసితో తమ జీవితభాగస్వామిని కూడా దూరం చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాలని భావించడం నిజంగా సమంజసం కాదు. తన మాట పెడచెవిన పట్టిందనే ఉద్దేశంతోనే అతడు తన అర్థాంగిని అర్థంతరంగా అంతమొందించాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన అవినాశ్ (30), […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 1, 2022 / 02:06 PM IST

    Kerala Husband Kills Wife

    Follow us on

    Kerala Husband Kills Wife: చిన్న చిన్న గొడవలే సంసారాలను గుల్ల చేస్తుంటాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతుంటాయి. చిన్న విభేదాలే ప్రాణాలు పోయే వరకు వేధిస్తుంటాయి. తన మాట వినలేదనే కసితో తమ జీవితభాగస్వామిని కూడా దూరం చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాలని భావించడం నిజంగా సమంజసం కాదు. తన మాట పెడచెవిన పట్టిందనే ఉద్దేశంతోనే అతడు తన అర్థాంగిని అర్థంతరంగా అంతమొందించాడు.

    Kerala Husband Kills Wife

    తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన అవినాశ్ (30), దీపిక (28) కేరళలోని కరాకురుప్పి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. అవినాశ్ పొద్దున్నే కొడుకును ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించగా భార్య ఆక్షేపించింది కానీ భర్త మాత్రం వినలేదు. దీంతో భర్త తీరుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. పళ్లు తోముకోకుండా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడంపై ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. కోపోద్రిక్తుడైన అవినాశ్ కత్తితో ఆమెపై దాడి చేశాడు.

    Also Read: Atrocities in Bihar: బిహార్ లో కూతురుపైనే అత్యాచారం చేస్తున్న తండ్రి.. చివరకు ఏం జరిగిందంటే?

    దీంతో ఆమె మెడ, తల వద్ద తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. అవినాశ్ ఎయిర్ ఫోర్స్ సివిల్ కాంట్రాక్టు కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితమే ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. తన భార్యను క్షణికావేశంలో దారుణంగా చంపడంతో అతడికి శిక్ష తప్పదనే తెలుస్తోంది. కట్టుకున్న భార్యపైనే హత్యకు పాల్పడటంతో అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి తీరుకు మండిపడుతున్నారు.

    Kerala Husband Kills Wife

    అయితే ఇప్పటికే అవినాశ్ కు ఇంకో వివాహం జరిగింది. ఒడిశాకు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్న అవినాశ్ ఆమెకు విడాకులు ఇచ్చి దీపికను చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవినాశ్ అర్ధాంగినే అంతం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. జీవిత భాగస్వామిని కడతేర్చేంత కసాయితనంతో అవినాశ్ తీరుకు అందరు శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో అతడి ప్రవర్తనపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి. నేరప్రవృత్తి కలిగిన వ్యక్తికి భార్యగా వచ్చినందుకు దీపిక బలి కావడం తెలిసిందే.

    Also Read:Gauravelli Project Land Evacuees: రైతు బాంధవుడి రాష్ట్రంలో రైతులకు సంకెళ్లా!.. ఇదేనా బంగారు తెలంగాణ!?

    Tags