
Ramoji Rao: అవినీతి ఆరోపణలు చేయగానే విచారణ చేసి నిరూపించాలంటే సవాల్ చేస్తారు. తీరా విచారణకు వస్తే రోగం వచ్చిందంటూ ఆసుపత్రులకు వెళ్లిపోతుంటారు. ఆ విచారణ ముందుకు సాగదు.. ఆ సవాల్ నెరవేరదు. ప్రస్తుత రాజకీయ పార్టీ నాయకుల వ్యవహార శైలి, విమర్శలు అలా ఉన్నాయి. తాజాగా రామోజీరావును విచారణ చేసేందుకు వెళ్లిన సిఐడి అధికారులకు అటువంటి పరిస్థితి ఎదురయింది. అప్పటికప్పుడు రామోజీరావు ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ బెడ్ మీద పడుకోవడం సిఐడి అధికారులను ఇబ్బందులకు గురి చేసింది.
తెలుగుదేశం పార్టీ అండ్ కో.. తమపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధం అని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తుంటారు. ఏరా ప్రభుత్వం విచారణకు సిద్ధమై వారిని ప్రశ్నించేందుకు వస్తే మాత్రం.. తమకు ఆరోగ్యం బాలేదంటూ మంచంపై వాలిపోతుంటారు. వీరికి తమకు అస్మదీయులైన ఆసుపత్రుల్లో బెడ్ కూడా సిద్ధమైపోతుంటుంది. తాజాగా టిడిపి ఆస్థాన గురువు, మీడియా మొగల్ రామోజీరావు విచారణ సందర్భంగా ఆయనకు అనారోగ్యం చేసిందంటూ మంచంపై వాలిపోయిన వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోంది. మార్గదర్శి కేసులో జోరుగా విచారణ సాగిస్తున్న సిఐడి అధికారులు.. ఈ కేసులో ఏ వన్ గా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ చైర్మన్ రామోజీరావును విచారించేందుకు సిఐడి అధికారులు వెళ్ళగా అనారోగ్యంగా ఉందంటూ బెడ్డపైన ఉండడం గమనార్హం.
చంద్రబాబు నుంచి రామోజీరావు వరకు అంతా..
తాజా రామోజీరావు విచారణకు సంబంధించి సిఐడి పోలీసులు వెళ్లినప్పుడు రామోజీరావు బెడ్ పై పడుకొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏవైనా ఆరోపణలు చేస్తే విచారణ చేసుకోవాలంటూ సవాల్ చేస్తారని.. తీరా విచారణకు వస్తే ఆరోగ్యం సహకరించడం లేదంటూ ఆసుపత్రిలో చేరిపోతుంటారని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇదే విధంగా చేశారని.. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చం నాయుడు విచారణ సందర్భంగా తనకు ఫైల్స్ సమస్య అంటూ ఆసుపత్రిలో చేరుకోవడం, మాజీ మంత్రి నారాయణ రాజధాని భూముల విషయంలో విచారణ సందర్భంగా ఆరోగ్యం సహకరించక ఆసుపత్రిలో ఉన్నారంటూ విచారణకు హాజరు కాకపోవడం వంటి విషయాలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఆయా సందర్భాల్లో టిడిపి నాయకులు, తాజాగా రామోజీరావు ఆసుపత్రుల్లో బెడ్ పై ఉన్న ఫోటోలు మీమ్స్ రూపంలో చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల పై ఏవైనా ఆరోపణలు చేస్తే నిరూపించాలంటూ సవాల్ చేయడం.. నిరూపించే క్రమంలో విచారణకు వస్తే ఇలా అనారోగ్యం అంటూ విచారణ తప్పించుకునే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.
రామోజీని విచారించిన సిఐడి అధికారులు..
మార్గదర్శి చైర్మన్ రామోజీరావును విచారించేందుకు రామోజీ ఫిలిం సిటీ కి వెళ్ళిన సిఐడి అధికారులకు చిక్కు వచ్చి పడింది. రామోజీరావు కు అనారోగ్యం చేయడంతో చికిత్స పొందుతున్నారంటూ సిబ్బంది తెలియజేశారు. ఈ సమయంలో విచారణ చేసేందుకు కొంత ఆలోచించిన సిఐడి అధికారులు.. ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత బెడ్ పై పడుకున్న రామోజీరావును విచారణ చేయాలని నిర్ణయించారు. అనుగుణంగానే రామోజీరావును సిఐడి అధికారులు మొదటి రోజు విచారించి తమకు కావాల్సిన వివరాలను సేకరించారు.

సామ్రాజ్యాన్ని సృష్టించిన తర్వాత.. తొలిసారి బహుశా..
రామోజీరావు మీడియా, వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన తర్వాత పోలీసులు ఆయన ఇంటి గడపదొక్కడం బహుశా ఇది తొలిసారి కావచ్చేమో. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు మార్గదర్శి వ్యవహారంలో విచారణ కు సిద్ధమైనప్పటికీ జాతీయ స్థాయి నాయకత్వం సహకరించకపోవడంతో ఆయన ముందుకు వెళ్లలేక పోయారు. ఆ తర్వాత నుంచి ఈ కేసు వ్యవహారాన్ని ఎవరో పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్గదర్శి వ్యవహారాన్ని బయటకు తీస్తారని అంతా భావించారు. అయితే గడిచిన మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి దీని గురించి పట్టించుకోలేదు. కానీ ఆకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ఇన్ ప్లీడ్ కావాలని నిర్ణయించడం, అందుకు అనుగుణంగా కోర్టుకు సమాచారాన్ని అందించడంతో మళ్లీ కేసు పుంజుకున్నట్లు అయింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి సిఐడి కి బాధ్యతలు అప్పగించండి. రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన సిఐడి అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. అందులో భాగంగానే ఈ కేసులో కీలక ముద్దాయిలుగా భావిస్తున్న చైర్మన్ రామోజీరావు, శైలజాకిరణ్ a1 ఏ2లుగా పేర్కొంటూ విచారణకు సిద్ధం కావాలంటూ కొద్దిరోజుల కిందట నోటీసులు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు విచారణ సాగిస్తున్నారు.