Vijay Deverakonda Family Assets: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు…తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు. లైగర్ సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేసిన కూడా అక్కడ వర్కౌట్ కాలేదు. దాంతో తెలుగు సినిమాల వైపే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన కింగ్ డమ్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ఈ సంవత్సరం మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తుంది. ‘రౌడీ జనార్ధన్’, ‘రణబాలి’ అనే సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమా షూటింగులు శరవేగంగా పూర్తవుతున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. రౌడీ జనార్ధన్ సినిమా రిలీజ్ డేట్ ఇంకా కన్ఫామ్ కాలేదు.
ఇక ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆయన రష్మిక మందానని పెళ్లి చేసుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ వాళ్ళ నాన్న ఇండస్ట్రీకి వచ్చి టివి సీరియల్స్ లో నటించాడు… అప్పుడు ఆయనకి పెద్దగా ఆదరణ దక్కలేదు. దాంతో తన కొడుకులను సైతం ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో విజయ్ ని ఆర్టిస్టుగా మార్చి సినిమాల వైపు తీసుకొచ్చాడు. ఇక విజయ్ దేవరకొండ వాళ్ళ నాన్న తన కెరియర్ లో సంపాదించింది ఏమీ లేకపోవడంతో తనకొక లగ్జరీ ఇల్లును కట్టించి కొన్ని ఆస్తులను విజయ్ వల్ల నాన్న పేరు మీదకి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు వాళ్ళ నాన్న కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందట. ఇక ఏది ఏమైనా కూడా తన కొడుకు వృద్ధిలోకి వచ్చాడు. తను టాప్ హీరోగా ఎదిగాడు అనే ఒక ఆనందమైతే విజయ్ దేవరకొండ వాళ్ల నాన్నకు ఉంది. ఇక విజయ్ దేవరకొండ హీరో అయిన తర్వాత తన తమ్ముడు ఆనంద్ ని సైతం ఇండస్ట్రీకి తీసుకువచ్చాడు. ప్రస్తుతం తను కూడా హీరోగా రాణించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…