
Director Venu: చిన్న సినిమా అయినా ‘బలగం’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఊరూ వాడా తేడా లేకుండా అందరూ ఈ సినిమాను చూసేందకు జనం థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. మట్టిలోనే మాణిక్యాలుంటాయని కామెడీ చేసే వేణు తనలోనూ మంచి రచయిత, డైరెక్టర్ ఉన్నారని నిరూపించాడు. అయితే ఒక మంచి పని చేసినప్పుడు ఎదురు దెబ్బలు తప్పవు. అలాగే ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు ఏదో మూల నుంచి విమర్శలు రాకుండా ఉండవు. ఇప్పుడు వేణు అలాంటివే ఎదుర్కొంటున్నారు. తనపై కొందరు చేసిన కామెంట్లకు ఆయన ఎమోషనల్ అయ్యారు. తాను పడ్డ కష్టాల గురించి చెప్పాడు. దీంతో ఆయన ఇంతలా రియాక్షన్ కావడానికి కారణమేంటి? అన్న ప్రశ్న ఎదురవుతోంది.
మొదట్లో బలగం సినిమాకు కమెడియన్ వేణుడైరెక్టర్ అంటే ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆయన సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వేణుపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. యువ దర్శకులకు వేణు ఆదర్శం అంటూ కీర్తిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా సన్మానాలు సత్కారాలు చేస్తున్నారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వేణుకు అభినందనలు దక్కడం విశేషం. ఇదే సమయంలో ఓ జర్నిలిస్టు ఈ కథ తనది అనడం సంచలనంగా మారింది. తాను రచించిన కథ ఓ దిన పత్రికలో ప్రచురితమైందని, దీనిని ‘బలగం’ సినిమా తీశారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా కమెడియన్ వేణు తన కథను దొంగిలించాడని ఆరోపించారు.
జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలపై వేణు ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అయ్యారు. తాను సిరిసిల్ల కూరగాయల మార్కెట్లో పనిచేశానని అన్నారు. భవన నిర్మాణ పనుల్లో తట్ట మోశానని చెప్పారు. అలాంటి నేను తప్పుుడు పనులు చేయనని అన్నారు. అక్కడున్న జర్నలిస్టులతో మీకందరికి తెలుసు నేను ఎలాంటి వారినోనని చెప్పారు. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో ఎన్నో రోజులు హైదరాబాద్ లో వెయిట్ చేశానని, తిండి తిప్పలు లేకుండా గడిపిన రోజులున్నాయని అన్నారు.

మంచి కథలు ఉంటే ఏ నిర్మిత అయినా ఆదరిస్తారు. అందులో దిల్ రాజు గారు కొత్త వారికి అవకాశం ఇస్తారన్న పేరుంది. మీకు నిజంగా దమ్ముంటే ఓ కథను తయారు చేసి దానిని దిల్ రాజు గారితో చెప్పండి. కానీ ఇలా ఒకరిని నిందించడం కరెక్ట్ కాదు అని వేణు ఎమోషనల్ అయ్యారు. అయితే వేణు ఇలా రియాక్ట్ కావడంపై ఆయన అభిమానులు సపోర్టు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా మీరు తీసిన సినిమా సూపర్ అంటూ కామెంట్ పెడుతున్నారు.