Ganesha Idol: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 18న ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ వినాయకుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. ఈ తరుణంలో హైదరాబాద్ లో పురాతన విగ్రహం బయల్పడింది. ఈ విగ్రహంలో చాళుక్యుల నాటిదని చరిత్రకారులు అంటున్నారు. రెండు చేతులు, ఏకదంతం, ఎడమ చేతిలో మోదుకాన్ని పట్టుకుని లలితాసనంలో కూర్చున్న ఈ గణపతిని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా వస్తున్నారు. ఇంతకీ ఈ విగ్రహం ఎక్కడ బయటపడిందంటే?
భారతదేవానికి వెయ్యేళ్లకు పైగానే చరిత్ర ఉంది. ఎంతో మంది రాజులు రాజ్యాలేలారు. వారి కాలంలో ఆలయాలు నిర్మించి విగ్రహాలను తయారు చేసేవారు. అలా 800 ఏళ్ల కిందట ఏలిన చోళులు ఈ వినాయక విగ్రహాన్ని తయారు చేయించారని చెబుతున్నారు. ఈ పురాతన గణేశుడు కేవలం రెండు చేతులను కలిగి ఉన్నాడు. పసుపు రంగులో ఉన్న సాధారణ ఆభరణాలు ధరించాడు. లలితాసనం అని పిలవబబే భంగిమలోకూర్చని ఉన్నాడు. ఇలాంటి విగ్రహాలను చోళ రాజ్యంలో తయారు చేశారని అంటున్నారు.
హైదరాబాద్ శివారలోని పెద్ద గోల్కోండ గ్రామంలో ఈ విగ్రహం బయటపడింది. వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఈ విగ్రహం బయల్పడడంతో శుభ పరిమాణం అని అంటున్నారు. దీంతో స్థానికులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఎస్. జై కిషన, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్, కోకన్వీనర్ ఇ. శివనాగిరెడ్డి, తదితరులు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
చరిత్రకారులు ఇదే ప్రాంతంలో పరిశీస్తున్న క్రమంలో కాకతీయుల కాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆ రోజుల్లో తయారు చేసిన నంది, ఉమా మహేశ్వర విగ్రహాలు కనుగొన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా శిల్పాలపై అనువర్తిర రంగులను తొలగించాలని గ్రామస్థులకు ఈ బృందం తెలిపింది.