https://oktelugu.com/

Photo Story: క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ పాప క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూస్తే ఆ హీరోయిన్ ఎవరో అర్థమవుతుంది. చిన్నప్పుడు హృతిక్ రోషన్ తో కలిసి ‘సూపర్ 30’లో నటించింది. ఆ తరువాత చదువు పూర్తయ్యాక మోడల్ గా రాణించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 21, 2023 / 06:05 PM IST
    Follow us on

    Photo Story: ఒకప్పుడు హీరోయిన్లు చిత్ర పరిశ్రమలోకి వచ్చాక.. కొన్ని సినిమాలు చేసిన తరువాత పరిచయం అయ్యేవారు. కానీ ఇప్పటి హీరోయిన్లు ఫస్ట్ మూవీతోనే యాక్టింగ్ తో అదరగొట్టి బెస్ట్ యాక్టర్ అనిపించుకుంటున్నారు.కొందరు చిన్నప్పడే ఇండస్ట్రీకి పరిచయం అయి కెమెరా ఫియర్ లేకుండా నటిస్తున్నారు. ఇదే కోవలో ఓ బ్యూటీ చిన్నప్పుడు ఓ సినిమాలో నటించి కెమెరా ఫీయర్ ను పోగొట్టుకుంది. పెద్దయ్యాక ఫస్ట్ మూవీతోనే బంపర్ హిట్టుకొట్టింది. ఆమె నటించిన మూవీ వందల కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

    పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూస్తే ఆ హీరోయిన్ ఎవరో అర్థమవుతుంది. చిన్నప్పుడు హృతిక్ రోషన్ తో కలిసి ‘సూపర్ 30’లో నటించింది. ఆ తరువాత చదువు పూర్తయ్యాక మోడల్ గా రాణించింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించి తెలుగు మూవీలో అవకాశం తెచ్చుకుని మొదటి సినిమాతో స్టార్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ బ్యూటీ ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందా. ఆమె ఎవరో కాదు అందాల తార కృతి శెట్టి.

    కృతి శెట్టి 21 సెప్టెంబర్ 2003న జన్మించింది. బాలనటిగా ‘సూపర్ 30’లో కనిపించింది. ఆ తరువాత 2021 లో తెలుగులో ‘ఉప్పెన’లో అవకాశం తెచ్చుకుంది. ఆమె నటించిన ఫస్ట్ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ తరువాత కృతి శెట్టికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. శ్యామ్ సింగరాయ్ లో నటించింది. ఇక ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అమ్మడుకు గుర్తింపు రాలేదు. ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి ఓ సినినిమాలో నటిస్తోంది.

    కృతి శెట్టి సినిమాల్లో తక్కువ గా కనిపించినా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ సందర్భంగా ఆమె ఎప్పటికప్పుడు ఫొటోలను అప్లోడ్ చేస్తుంది. తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా విషెష్ చెబుతున్నారు. అయితే కృతి శెట్టి నెక్ట్స్ మూవీ లో ఎలా అలరిస్తుందో చూడాలి.