https://oktelugu.com/

Dhoni- Chahal: అందరిని ఆటపట్టించే చాహల్ ధోని ముందు ఎందుకు సైలెంట్ గా ఉంటాడు అంటే..?

ఐసిసి నిర్వహించే అన్ని ట్రోఫీలు గెలిచిన ఏకైక ఇండియన్ టీమ్ కెప్టెన్ గా హిస్టరీలో నిలిచాడు. ప్రస్తుతం మహి భాయ్ అన్ని ఇంటర్నేషనల్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : September 21, 2023 / 05:58 PM IST

    Dhoni- Chahal

    Follow us on

    Dhoni- Chahal: ప్రపంచ క్రికెట్ చరిత్ర లో ఆయన ధోనీ ఒక గొప్ప కెప్టెన్.ధోనీ గురించి ఎంత ఎక్కువ చెప్పిన తక్కువే అవుతుంది. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆయన చేసిన సేవలు అలాంటివి.ఆయన కెప్టెన్ అవ్వక ముందు ఉన్న ఇండియా టీం వేరు, ఆయన కెప్టెన్ అయిన తర్వాత ఇండియా టీమ్ వేరు. ఎందుకంటే ఆయన ఇండియా టీం లో చాలా వరకు మార్పులు చేస్తూ తను ఎలాగైతే ఇండియా టీం ఉండాలి అనుకున్నాడో అలాగే ఇండియా టీం ని ఉంచుతూ ఇండియా టీం ని ప్రపంచంలోనే నెంబర్ వన్ లో ఉంచే ప్రయత్నం చేశాడు అందులో 100 పర్సెంట్ సక్సెస్ కూడా అయ్యాడు.ఇక ఐసిసి నిర్వహించే అన్ని ట్రోఫీలు గెలిచిన ఏకైక ఇండియన్ టీమ్ కెప్టెన్ గా హిస్టరీలో నిలిచాడు. ప్రస్తుతం మహి భాయ్ అన్ని ఇంటర్నేషనల్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఒక ఐపిఎల్ ల్లో మాత్రమే ఆయన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.అది కూడా అభిమానులు తనని మిస్ అవ్వకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన చెన్నై టీమ్ తరఫున మ్యాచ్ లు ఆడుతున్నాడు తప్ప అంతకుమించి ఆయనకి ఆడాలి ఇంకా ఏదో సాధించాలి అనేది మాత్రం కాదు. ఎందుకంటే ఇప్పటికే చెన్నై టీం తరఫున ఐదుసార్లు కప్పు తీసుకొచ్చి పెట్టాడు ప్రస్తుతం ఐపీఎల్ హిస్టరీలోనే చెన్నై, ముంబై రెండు టీం లు కూడా ఐదు సార్లు కప్ గెలిచిన టీంలు గా టాప్ లో ఉన్నాయి.ఇక ఇది ఇలా ఉంటే ఖాళీ టైం లో టీమ్ మెంబర్స్ అందర్నీ ఆటపట్టించే చాహల్ ధోని వస్తే మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చొని అతను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెబుతూ ఉంటాడు.ఎందుకంటే ధోని అంటే అతనికి రెస్పెక్ట్, భయం అన్నీ ఉంటాయి.

    ఎందుకు అంటే ఒకరోజు సెంచూరియన్ లో సౌత్ ఆఫ్రికా తో టి20 మ్యాచ్ ఆడుతున్నప్పుడు చాహల్ నాలుగు ఓవర్లు వేసి 64 రన్స్ ఇచ్చాడు క్రీజ్ లో క్లాసిన్ ఉండి వీరబాదుడు భాదుతున్న టైంలో కూడా ధోని చాహాల్ ని ఏమీ అనకుండా చాహల్ పై నమ్మకం ఉంచి క్లాసన్ స్ట్రైక్ లో ఉన్నప్పుడు చాహల్ దగ్గరికి వచ్చి రౌండ్ ద వికెట్ వేస్తావా అని అడిగాడు దానికి చాహల్ ఓకే వేస్తాను అని చెప్పాడు అలానే వేశాడు అయిన కూడా క్లాసెన్ సిక్స్ కొట్టాడు. అప్పుడు ధోని తన దగ్గరకు వచ్చి ఈరోజు నీది కాదు అయినా కూడా నువ్వేం బాధపడకు బౌండరీస్ రాకుండా బౌలింగ్ వేయడానికి ట్రై చేయి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చాడు అని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చాహల్ ఇదంతా చెప్తూ నాది కానీ రోజున కూడా ధోని నాకు అండగా నిలబడ్డాడు ధోని గురించి గొప్పగా చెప్పాడు…అందుకే ధోనీ ఎదురుగా ఉన్నప్పుడు గురువు లా భావించి ఆయన ముందు ఏం మాట్లాడను అని చెప్పాడు…