https://oktelugu.com/

Hyderabad: సరిహద్దుల్లో రక్షణ కల్పించే జవాన్లకు.. మనమిచ్చే గౌరవం ఇది

హైదరాబాద్ మహానగరంలో నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై కునాల్(32) అనే ఓ ఆర్మీ జవాన్ నిలబడి ఉన్నాడు. ఉదయం పరేడ్ పూర్తయిన తర్వాత వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లేందుకు అక్కడ నిల్చున్నాడు.

Written By: , Updated On : March 5, 2024 / 02:44 PM IST
Hyderabad

Hyderabad

Follow us on

Hyderabad: దట్టంగా కురిసే మంచులో.. మాడు పగలగొట్టే ఎండలో.. ముంచే వర్షంలో.. ఇలా ఎలాంటి వాతావరణంలో నైనా సరే సైనికులు కాపలాగా ఉంటారు. మన దేశానికి రక్షణ కల్పిస్తూ ఉంటారు. విధి నిర్వహణలో చివరికి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడరు. సైనికులు అలాంటి త్యాగాలు చేస్తారు కాబట్టే జై జవాన్ అనే నినాదం పుట్టింది. నినాదంలో గొప్పతనం ఉన్నప్పటికీ.. చేతల్లో మాత్రం సమాజం నుంచి అంతటి ఉదారత లేదు. దీనిని నిరూపించే సంఘటన హైదరాబాద్ మహానగరంలో జరిగింది.

హైదరాబాద్ మహానగరంలో నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై కునాల్(32) అనే ఓ ఆర్మీ జవాన్ నిలబడి ఉన్నాడు. ఉదయం పరేడ్ పూర్తయిన తర్వాత వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లేందుకు అక్కడ నిల్చున్నాడు. ఈలోగా ఒక సిమెంట్ రెడీ మిక్సర్ వాహనం కునాల్ ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ఢీకొట్టిన తీరుకి అతడికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కూడా ఎక్కువగా అయింది. ఆ ప్రాంతం మీదుగా వెళ్లేవారు అతడి మృతహాన్ని చూసి కూడా ఆగకుండా వెళ్ళిపోయారు. కనీసం అతడిని చూసే ప్రయత్నం కూడా చేయలేదు..

కునాల్ ది ఉత్తర భారత దేశంలోని ఓ గ్రామం. పేద కుటుంబం. ఆర్మీలో పని చేయాలన్నది అతని చిన్ననాటి కోరిక. అలా ఆర్మీ రిక్రూట్మెంట్ లో ప్రతిభ చూపి జవాన్ అయ్యాడు. విధి నిర్వహణలో భాగంగా గోల్కొండ ఆర్టిలరీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబంతో కలిసి అతడు ఇక్కడే ఉంటున్నాడు. కునాల్ మృతదేహాన్ని చూసి కూడా చాలామంది అలా వెళ్లిపోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన జవాన్లకు ఇచ్చే గౌరవం ఇదా అంటూ ప్రశ్నిస్తున్నారు..

కునాల్ మృతికి సంబంధించి సమాచారం తెలియడంతో స్థానికంగా ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పారు. కునాల్ ను ఢీ కొట్టిన వాహనం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో సిసి ఫుటేజ్ పరిశీలించారు. కాగా, త్వరలో నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.