https://oktelugu.com/

Annamalai-Modi : అన్నామలై, మోడీ మాయలో తమిళనాడు ఎన్నికల వాతావరణం

అన్నామలై, మోడీ మాయలో తమిళనాడు ఎన్నికల వాతావరణంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : March 5, 2024 / 03:10 PM IST
    Follow us on

    Annamalai-Modi : తమిళనాడు ఎన్నిసార్లు వివరించినా కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న చెన్నైలో రెండేళ్ల తర్వాత నిర్వహించిన మోడీ సభకు జనం బాగా వచ్చారు. బాగా రిసీవ్ చేసుకున్నారు. మోడీ సభలకు తమిళ జనం ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎంగేజ్ అవుతున్నారు. తమిళనాడులో బీజేపీకి ఇలాంటి పరిణామం ఎప్పుడూ జరగలేదు.

    మోడీ , అన్నామలై మాయలో తమిళజనం పడ్డారు. వీరి మేనియా తమిళనాడులో కొనసాగుతోంది. అసలు నిన్న చెన్నై మీటింగ్ ఊహించిన దానికంటే బెటర్ గా సాగింది. డీఎంకేకు చెన్నై పోర్టు లాంటిది. కంచుకోటగా బలంగా చెన్నైలో డీఎంకే ఉంది. తమిళనాడు అంచనాలు తలకిందులవుతున్నాయి..

    బీజేపీ తమిళనాట ఈసారి అంతో ఇంతో బలం పెంచుకుందని తెలుస్తోంది. దేశంలో మోడీ మేనియా కొనసాగుతోంది. తమిళనాడులో 3.50 శాతం నుంచి బీజేపీ గ్రాఫ్ 18 శాతం వరకూ పెరిగిందని చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఈ స్థాయి ఉందని సర్వేల్లో తేలింది. చెన్నైలో ప్రస్తుతం ఆదరణ బాగా ఉంది.

    అన్నామలై, మోడీ మాయలో తమిళనాడు ఎన్నికల వాతావరణంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.