https://oktelugu.com/

Amrutha Pranay: ఇంత విషాదం తర్వాత ఇన్నేళ్లకు అమ్మను కలిసిన అమృత.. ప్రణయ్‌ కుటుంబానికి షాక్‌..!

అమృతకు బాబు పుట్టాడు. ప్రస్తుతం ప్రణయ్‌ జ్ఞాపకాలతో అత్తవారింట్లోనే ఉంటున్న అమృత.. యూట్యూబ్‌ చానెల్‌ నిర్వహిస్తోంది. ఇందులో తన బాబు మెమరబుల్‌ మూమెట్స్‌ షేర్‌ చేస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 3, 2023 5:27 pm
    Amrutha Pranay

    Amrutha Pranay

    Follow us on

    Amrutha Pranay: తెలంగాణలో 2018లో దారుణ హత్యకు గురైన 24 ఏళ్ల ప్రణయ్‌ పెరుమాళ్ల భార్య అమృత ఆరేళ్ల తర్వాత తల్లిని కలిసింది. ప్రణయ్‌ హత్య అప్పట్లో సంచలనంగా మారింది. ఈ హత్యను అమృత తండ్రే చేయించడం గమనార్హం. దీంతో అమృత స్వయంగా తన తండ్రిపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఓ గదిలో రెండేళ్ల క్రితం అత్మహత్య చేసుకున్నాడు.

    తండ్రి చివరి చూపుకోసం..
    మారుతీరావు ఆత్మహత్య తర్వాత తండ్రిని కడసారి చూసేందుకు అమృత యత్నించింది. మిర్యాలగూడకు వెళ్లింది. ఆమెపై దాడి జరగవచ్చని అధికారులు చెప్పడంతో పోలీసు భద్రత మధ్య ఆమెను తీసుకొచ్చారు. ఆమె కారు దిగగానే మారుతీరావు సానుభూతిపరులు గుమిగూడ రచ్చర్చ చేశారు. ‘మారుతీరావు అమర్‌ రహే’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె దూరం నుంచి తండ్రిని కడసారి చూసుకుని వెళ్లిపోయింది..

    మారుతీరావు చివరి కోరిక అదే..
    ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు అమృతను చివరి కోరిక కోరాడు. ఆత్మహత్య చేసుకున్న గదిలో దొరికన లేఖలో అమృత అమ్మతో కలిసి ఉండు.. అమ్మను చూసుకో అని కోరాడు.

    యూట్యూబ్‌ నిర్వహిస్తున్న అమృత..
    అమృతకు బాబు పుట్టాడు. ప్రస్తుతం ప్రణయ్‌ జ్ఞాపకాలతో అత్తవారింట్లోనే ఉంటున్న అమృత.. యూట్యూబ్‌ చానెల్‌ నిర్వహిస్తోంది. ఇందులో తన బాబు మెమరబుల్‌ మూమెట్స్‌ షేర్‌ చేస్తుంది. తాజాగా ఇందులో తన తల్లితో కలిసి ఉన్న వీడియో షేర్‌ చేసింది. ఇందులో ఆరేళ్ల తర్వాత అమ్మను కలిశానని పేర్కొంది. ఆ వీడియోలో అమృత తల్లి కూడా సంతోషంగా కనిపించారు. అమృత కూడా చాలా హ్యాపీగా ఉంది. దీంతో ఇక అంతా కలిసిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    సోషల్‌ మీడియాలో వైరల్‌..
    ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని చూసి చాలా మంది అమృతను అభినందిస్తున్నారు. అదే సమయంలో నెక్స్‌ స్టెప్‌ తీసుకోవాలని కూడా కామెంట్‌ చేస్తున్నారు. కానీ అమృత మాత్రం ప్రణయే తన సర్వస్వం అంటోంది.