Opposition Parties : ప్రతిపక్షాలు పార్లమెంట్ సృష్టిస్తున్న అల్లర్లు ఎందుకు వర్కవుట్ కావడం లేదు. ప్రతీరోజు పార్లమెంట్ లో బిల్లులు పాస్ అవుతూనే ఉన్నాయి. బీజేపీని ఇరుకునపెట్టకుండా ప్రతిపక్షాలు పార్లమెంట్ లో తప్పులు చేస్తున్నాయి. వాదించకుండా బీజేపీకే మేలు చేస్తున్నాయి.
మణిపూర్ సమస్య మీద ఒక సీరియస్ చర్చ జరగాలి. లాంగ్ టర్మ్ చర్చ సాగాలి. ప్రధానమంత్రి స్వయంగా ప్రకటన చేయాలి. సమాధానమివ్వాలి. ఈ రూల్స్ ను బట్టి క్వశ్చన్ అవర్, జీరో అవర్ పక్కనపెట్టి చర్చించాలని కోరుతున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ సమస్యపై ఎన్ని గంటలు అయినా చర్చిస్తామని ప్రకటించారు. అయినా కాంగ్రెస్ నేతలు లొల్లి చేస్తున్నారు. రూల్ కోసం చర్చ జరగకుండా ప్రతిపక్షాలు లొల్లి చేయడమే విడ్డూరం.
చర్చ జరగకుండా ఉండేందుకు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీనిపై మాట్లాడాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. దాని కోసం చర్చనే ఆపేస్తున్నారు.
ప్రతిపక్షాల పార్లమెంట్ వ్యూహం వెనక అసలు కథేంటో తెలుసా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..