Allu Arjun Pushpa : బర్త్ డే ట్రీట్ వచ్చేస్తుంది…  అల్లు అర్జున్ ఫ్యాన్స్ సిద్ధం కండి!

Allu Arjun Pushpa :  ఏప్రిల్ అల్లు అర్జున్ బర్త్ డే మంత్. ఆల్రెడీ అభిమానుల్లో ఫీవర్ మొదలైపోయింది. ఆయన జన్మదిన వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఐకాన్ స్టార్ బర్త్ డే వేడుకల్లో భాగంగా దేశ ముదురు చిత్ర స్పెషల్ షోస్ ప్రదరిస్తున్నారు. దేశ ముదురు చిత్ర రీరిలీజ్ కి భారీ రెస్పాన్స్ దక్కినట్లు సమాచారం. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయట. ఇతర హీరోల రీరీలీజ్ రికార్డులు బద్దలు కొట్టాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ గట్టిగానే […]

Written By: NARESH, Updated On : April 4, 2023 7:58 pm
Follow us on

Allu Arjun Pushpa :  ఏప్రిల్ అల్లు అర్జున్ బర్త్ డే మంత్. ఆల్రెడీ అభిమానుల్లో ఫీవర్ మొదలైపోయింది. ఆయన జన్మదిన వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఐకాన్ స్టార్ బర్త్ డే వేడుకల్లో భాగంగా దేశ ముదురు చిత్ర స్పెషల్ షోస్ ప్రదరిస్తున్నారు. దేశ ముదురు చిత్ర రీరిలీజ్ కి భారీ రెస్పాన్స్ దక్కినట్లు సమాచారం. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయట. ఇతర హీరోల రీరీలీజ్ రికార్డులు బద్దలు కొట్టాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటికీ మించి పుష్ప 2 అప్డేట్ ఉంటుందా లేదా అనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో ఉంది. దానికి సమాధానం దొరికేసింది. 

 రేపు ఉదయం 11:07 నిమిషాలకు పుష్ప 2 నుండి అప్డేట్ వస్తుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. అంటే అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ప 2 నుండి ఏమి విడుదల చేస్తారో చెప్పనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫస్ట్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారట. నిమిషానికి పైగా ఉండే కాన్సెప్ట్ టీజర్ అద్భుతంగా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా పుష్ప 2 అప్డేట్ అనగానే బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలేస్తుంది. 
 
పుష్ప పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ భారీగా తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ రెండింతలు పెంచారు. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారనే ప్రచారం జరుగుతుంది. పుష్ప 2 బడ్జెట్ రూ. 300 కోట్లకు పైమాటే అంటున్నారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ దృష్టిలో ఉంచుకుని భారీతనంతో పాటు వివిధ పరిశ్రమలకు చెందిన నటులను భాగం చేశారు. 
 

వైజాగ్, హైదరాబాద్ లలో షూటింగ్ జరిపారు. పుష్ప 2 అంచనాలకు మించి ఉంటుందనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందాన అల్లు అర్జున్ కి జంటగా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయతో పాటు పలువురు స్టార్ క్యాస్ట్ భాగమయ్యారని సమాచారం. వెయ్యి కోట్ల వసూళ్లు టార్గెట్ గా పుష్ప విడుదల చేయనున్నారట.