Joe Biden : ట్రంప్ పై దాడి గురించి ఎన్ఏఏసీపీలో అధ్యక్షుడు బైడన్ సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ప్రెసిడెంట్ ఏమన్నారంటే

అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి ఉద్రిక్తతలు, హింసను తగ్గించే ప్రయత్నం చేశాను. అమెరికాలో మనం శత్రువులం కాదు. ఒకరికొకరం తోటి అమెరికన్లం. ఇలాంటి దాడులు సరికాదు. అయితే ఈ క్రమంలో బైడెన్ కొన్ని రాజకీయ విమర్శలు చేశారు. మన ప్రత్యర్థుల ప్రయాణం ఎలాంటిదో మీ అందరికీ తెలుసు

Written By: NARESH, Updated On : July 17, 2024 3:43 pm

Biden Vs Trump

Follow us on

Joe Biden : అమెరికాలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నల్లజాతి ఓటర్లను ఆకర్షించేందుకు ఆయన నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై గత వారం జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెవేడా లోని లాస్ వెగాస్ లో మంగళవారం (జూలై 16) రోజున ఆయన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై విమర్శలు చేశారు. బైడెన్ ఏం మాట్లాడారంటే..

హింసపై ఆక్షేపణ
అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి ఉద్రిక్తతలు, హింసను తగ్గించే ప్రయత్నం చేశాను. అమెరికాలో మనం శత్రువులం కాదు. ఒకరికొకరం తోటి అమెరికన్లం. ఇలాంటి దాడులు సరికాదు. అయితే ఈ క్రమంలో బైడెన్ కొన్ని రాజకీయ విమర్శలు చేశారు. మన ప్రత్యర్థుల ప్రయాణం ఎలాంటిదో మీ అందరికీ తెలుసు. అసలు ఈ సంస్కృతిని ప్రోత్సహించిందెవరో తెలుసా.. మనం ఎవరం.. ఏం చేశామనేది మనకు ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. ఈ రాజకీయ ఆటలో ఇలాంటివి మంచిది కాదని చెప్పుకొచ్చారు.

అమెరికాలోని ప్రముఖ పౌర హక్కుల సంస్థ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ (NAACP) జాతీయ సమావేశం-4లో బైడెన్ ఈ వ్యాఖ్యలను చేశారు. 20 ఏళ్ల వ్యక్తి పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో పైకప్పుపై నిలబడి, ర్యాలీలో మాట్లాడుతున్నప్పుడు ట్రంప్‌పై ఏఆర్-15 తరహా రైఫిల్‌తో కాల్పులు జరిపిన మూడు రోజుల తర్వాత బైడెన్ దాని గురించి మాట్లాడాడు. నవంబర్ 5వ తేదీ జరిగే అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ కాల్పులు మరింత వేడిని పెంచాయని ఆయన స్పష్టం చేశారు.

గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్న బైడెన్
డెమొక్రాటిక్ పార్టీకి చెందిన బైడెన్ అధ్యక్షుడిగా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ట్రంప్ పై జరిగిన దాడి నేపథ్యంలో అమెరికన్ల దృష్టి రిపబ్లికన్లవైపునకు మళ్లిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.. ట్రంప్ పై చేసిన విమర్శల ప్రకటనలను టీవీల్లో ఆయన తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ దాడిపై ఐక్యంగా ముందుకెళ్దామని కోరారు. రెండు పార్టీలు సంయుక్తంగా ఈ దాడిని నిరసించాలని, శాంతి ర్యాలీ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. హింస సమాధానం కాదని అందరం ఒక్క గొంతుకతో నినదిద్దామని కోరారు. ట్రంప్ కోలుకోవాలని ఆకాంక్షించారు.

అయితే ట్రంప్ పై కాల్పుల అనంతరం ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు రావడంతో బైడెన్ అప్రమత్తమయ్యారు. మిన్నెసోటాలో జార్జ్ ఫాయిడ్ అనే నల్లజాతి వ్యక్తి హత్యపై స్పందించారు. దీనికి కారణమెవరని ప్రశ్నించారు. మీరు హింసకు వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటే, అన్ని హింసలకు కారణమెవరనేది ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాతే పెన్సిల్వేనియాలో అధ్యక్ష్య అభ్యర్థులపై జరిగిన హింసకు వ్యతిరేకంగా మీరు నిలబడాలని కోరారు.

మరోసారి అవకాశం ఇవ్వాలని..
మంగళవారం నాటి ప్రసంగంలో, బైడెన్ తన పరిపాలన చారిత్రాత్మకంగా నల్లజాతి కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు కేటాయించిన మిలియన్ డాలర్ల నిధులపై చెప్పుకొచ్చాడు. నల్లజాతీయుల నిరుద్యోగంలో తగ్గుదలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ట్రంప్ యొక్క ఆర్థిక విధానాలు ఆ లాభాలను తిప్పికొట్టగలవని హెచ్చరించాడు. జూన్ 27న ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా రిపబ్లికన్ వలసదారులు “బ్లాక్ జాబ్స్” తీసుకుంటున్నారని ప్రస్తావించినప్పుడు ట్రంప్ చేసిన చాలా ఎగతాళి చేసిన ప్రకటనను గుర్తు చేశారు. అయితే ఆ పదబంధాన్ని జాత్యహంకారమని చాలామంది ఖండించారు. అమెరికా బాగు కోసం మరోసారి డెమోక్రాటిక్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. దేశాన్ని శాంతియుతంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇది మంచి అవకాశమని చెప్పారు.