Gulliain Barre Syndrome: కరోనా కాలం తరువాత ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ హెల్త్ కేర్ తీసుకుంటున్నారు. కానీ కొత్త కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా తరువాత రకరకాల వేరియంట్లు పుట్టుకొచ్చాయి. కానీ సెకండ్ వేవ్ లా విస్తరించలేదు. కానీ తాజాగా మరో వ్యాధి అందరిని గుబులు పుట్టిస్తోంది. విషజ్వరం వచ్చిన వారిలో కొత్త వేరియంట్ పుట్టుకొస్తుంది. అదే ‘గులియన్ బార్ సిండ్రోమ్’ (Gulliain Barre Syndrome). GBS అని పిలువబడే ఈ వ్యాధి సోకిన వారిలో కాళ్లు చచ్చుబడిపోయి.. నీరసంగా తయారవుతారు. ఆ తరువాత అత్యవసర పరిస్థితికి చేరి ఆసుపత్రికి వెళ్లేలా చేస్తుంది. 2021లోనే హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ వ్యాధి గురించి తాజాగా తీవ్ర చర్చ సాగుతోంది.
వర్షాకాలం వచ్చిందంటే వైరల్ ఫీవర్ మొదలవుతుంది. వాతావరణ పరిస్థితులు మారుతూ ఇన్ఫెక్సన్లు సోకుతాయి. ఇలాంటి సమయంలో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకురావొచ్చు. వైరల్ ఫీవర్ వచ్చి ఆ తరువాత తగ్గిన తరువాత కూడా అచేతనంగా మారడం.. నరాలు బలహీనంగా ఉండే అవకాశాలు ఉంటే దానిని ‘గులియన్ బార్ సిండ్రోమ్’ గా గుర్తించవచ్చని వైద్యులు ప్రకటిస్తున్నారు. నరాల చచ్చుబడిపోయినట్లు మారడం ప్రధానంగా చెబుతున్నారు.
గులియన్ బార్ సిండ్రోమ్ 4 రకాల్లో ఉంటుంది. అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమిలినేటింగ్ పాలిరాడిక్యూలోన్యూరోపతి, మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్, అక్యూట్ మోటార్ యాక్సోవల్ న్యూరోపతి, అక్యూట్ మోటార్ సెన్సరీ యాక్సోనల్ న్యూరోపతిలలో మారుతూ ఉంటుంది. వ్యాధి సోకిన వారి లక్షణాలను భట్టి ఇది రకమో వైద్యులు గుర్తిస్తారు. పాదాలు, చేతుల్లో జలదరింపు, శరీరంలో ఏదో ఒక భాగంలో పక్షవాతం రావడం, కండరాల బలహీనత, ముఖ కండరాలు కదిలించడంలో బలహీనత, మాట్లాడడం, నమలడం ఇబ్బందిగా మారడం, మూత్రాశయం నియంత్రణ కోల్పోవడం, ఊపిరాడకపోవడం లాంటి లక్షణాలు భట్టి ఈ వ్యాధిని కనుక్కొంటారు.
గతంలో ఏడాదిలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఈ వ్యాధి లక్షణాలు కనిపించేవి. మరీ ముఖ్యంగా వృద్ధుల్లో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు అన్నివయసుల వారిలో దీనిని గుర్తిస్తున్నారు. అయితే ఈ వ్యాధి సోకిందని ఎలా తెలియాలి? వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. గులియన్ సిండ్రోమ్ నేరుగా అటాక్ అయినట్లు తెలియదు. కానీ శరీరం ఒక్కసారిగా బలహీనంగా మారిపోయినప్పడు, నార్మల్ గా పడుకున్నప్పుడు శ్వాస ఆడకపోవడం, లాలాజలం ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
జీబీ సోకిన ప్రారంభంలో తీవ్రత లక్షణాలు కనిపించవు. 7 నుంచి 14 రోజుల తరువాత ఈ వ్యాధి తీవ్రమవుతుంది. ఈ సమయంలో దీనిని గుర్తించడానికి తొలుత సాధారణ పరీక్ష చేస్తారు. అందులో పోటాషియమ్, కాల్సియమ్ క్వాంటిటీని గుర్తిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయని తేలిన తరువాత జీబీ పరీక్ష చేస్తారు. ఈ వ్యాధి ఎక్కడ పుడుతుందోనని ప్రత్యేకంగా చెప్పలేమని వైద్యులు అంటున్నారు. కానీ వెన్ను నుంచి పూసపై దాడి చేసిందా.. అని తెలుసుకోవడానికి సెరిబ్రో స్పైనల్ ఫ్లయిడ్ పరీక్ష కూడా చేస్తారు.
గులియన్ సోకిన తరువాత వైద్యుల చికిత్స తప్పనిసరి. అయితే తీవ్రతను భట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. దీనిని మొదట్లోనే గుర్తిస్తే బాధితుడు తనంతట తాను అవయవాలు కదిలించేస్థితిలో నయం చేసుకోవచ్చు. తీవ్రత ఎక్కువైనప్పుడు మంచానికే పరిమితం కావొచ్చు. ఈ సమయంలో కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా శ్వాస కోశ ఇబ్బందులు సమస్యలు లేనట్లయితే పర్వాలేదు. లేకుంటే ఆక్సిజన్ పెట్టి శ్వాస అందించాల్సి కూడా రావొచ్చు.