Old Rickshaw Wala: అవిశ్రాంత రిక్షావోడు.. వృద్ధాప్యంలోనూ రిక్షా తొక్కుతున్న వ్యక్తి.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోను చూసిన నెటిజన్లు మహిళ ఔదార్యాన్ని అభినందిస్తున్నారు. వృద్ధుడి జీవన పోరాటం చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : May 30, 2024 4:00 pm

Old Rickshaw Wala

Follow us on

Old Rickshaw Wala: మన జీవితం మన చేతిలో ఉండదు. పరిస్థితులే మన జీవితాన్ని నడిపిస్తాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. పరిసరాల ప్రభావం, జీవనశైలి, అదృష్టం ఇవన్నీ మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కొందరు ఏ పనీ చేయకున్నా.. వారి సందప పెరుగుతూనే పోతుంది. కొందరు జీవితాంతం కష్టపడాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నా.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. పేదల బతుకులు మాత్రం మారడం లేదు. ఇందుకు ఈ అవిశ్రాంత రిక్షావోడే నిదర్శనం. ఎనిమిది పదుల వయసులోనూ తమను , తమ కుటుంబాలను పోషించుకోవడానికి రిక్షా తొక్కుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో వృద్ధుడి కఠినమైన జీవన పోరాటం కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన తర్వాత కళ్లు చెమర్చకుండా ఉండవు.

సాయం చేసిన మహిళ..
వీడియోలో ఒక వృద్ధ రిక్షా పుల్లర్‌ చిరునవ్వుతో నిలడి ఉడడం, అతనితో మాట్లాడడానికి ఓ మహిళ ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. ఆ మహిళ వృద్ధుడి రిక్షాపై కూర్చుంది. ఈ వయసులో కూడా అతడు పడుతున్నకష్టాన్ని చూసి.. అతనిపై జాలిపడి, ఆ తర్వాత రిక్షా దిగి అతనికి డబ్బు సహాయం చేయడానికి ప్రయత్నించింది. ముందుగా ఆ వృద్ధుడిని ఆ మహిళ ఛార్జీ ఎంత అని అడగ్గా.. మహిళతో రూ.100 అని చెప్పాడు. అప్పుడు ఆమె రూ.500 నోటు ఇచ్చింది. అంతేకాదు ఆమె తన సోదరుడు, భర్త పేరిట మరో రెండు 500 రూపాయల నోట్లను ఇచ్చింది.

మహిళను అభినందిస్తున్న నెటిజన్లు..
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోను చూసిన నెటిజన్లు మహిళ ఔదార్యాన్ని అభినందిస్తున్నారు. వృద్ధుడి జీవన పోరాటం చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. హృదయాన్ని హత్తుకునే వీడియో AbhayRaj&017 అనే ఐడీతో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

వేల వ్యూస్‌..
నిమిషం నిడివి గల ఈ వీడియో ఇప్పటికే కొన్ని వేల వ్యూస్‌ సొంతం చేసుకుంది. నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒకరు ‘ఇది చాలా విచారకరమైన పరిస్థితి’ అని రాస్తే, మరొకరు పరిస్థితులు మనిషి జీవితాన్ని బలవంతంగా పని చేయిస్తుంది అని కామెంట్‌ చేశారు. అదేవిధంగా మరొకరు ‘పరిస్థితులపై ఎవరికీ నియంత్రణ లేదు’ అని కామెంట్‌ చేయగా ‘పేదరికంలో వయస్సు పరిగణించబడదు.. డబ్బు లేకపోతే జీవితం లేదు అని వ్యాఖ్యానించారు.